‘ లింగ నిర్ధారణ నిషేధం’ పోస్టర్లను ప్రదర్శించాలి
1 min readడీఎంహెచ్ఓ బి. రామగిడ్డయ్య
పల్లెవెలుగువెబ్, కర్నూలు : జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లలో గర్భధారణ మరియు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల ( లింగ నిర్ధారణ నిషేధం) చట్టం పోస్టర్లను ప్రదర్శించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. రామగిడ్డయ్య తెలిపారు. గురువారం డీహెచ్ఎంలోని డెమో కార్యాలయంలో పోస్టర్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ 1994 నిబంధనలు, పోస్టర్లను డీఎంహెచ్ఓ కార్యాలయంలోని డెమో సెక్షన్లో ఉన్నాయని, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు వచ్చి తీసుకెళ్లాలని సూచించారు. ఆసుపత్రి ఎంట్రెన్స్, వెయిటింగ్ హాల్ నందు మరియు స్కానింగ్ మిషన్ వున్న గదిలో ఈ పోస్టర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రఘురాం, సుమలత, లీగల్ కన్సల్ టెంట్ తదితరులు పాల్గొన్నారు.