PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తాం

1 min read

– హెచ్. తిమ్మన్న ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పల్లెవెలుగు వెబ్​ కర్నూలు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమానికి ఒక వెయ్యి కోట్ల రూపాయల తో సంక్షేమనిధి నీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్.తిమ్మన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు తేదీ 25-02-2023 న పట్టణం లోని ప్రైవేట్ పాఠశాలలు సందర్శించి వారి సమస్యలు సేకరించారు. ప్రైవేటు పాఠశాలల రికగ్నిషన్ పదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించడం, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఇంత వరకు పా ట్య పుస్తకాలు పంపిణీ చెయ్యక పోవడాన్ని ఖండిస్తున్నామని అన్నారు.మార్చి 13 న జరిగే పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లో ఆలోచించి ఉద్యమ నాయకులను వామపక్ష భావజాల అభ్యర్థులను కత్తి నరసింహారెడ్డి గారిని, పోతుల నాగరాజు గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపించాలని, ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్.తిమ్మన్న పిలుపు నిచ్చారు. ఈ మేరకు కోడుమూరు పట్టణం నందలి పాఠశాలలు విశ్వవాణి, టాగూర్, రామన్ , వేకటేశ్వర ప్రైవేట్ స్కూల్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమములో వామ పక్ష ప్రజా సంఘాల నాయకులు కృష్ణ, రాముడు, రాజు,గఫూర్, ఈరన్న, ఎస్టీయూ కోడుమూరు మండల ప్రధాన కార్యదర్శి యస్.శ్రీనివాసులు, AISF నాయకులు రంగస్వామి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.(1)ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ శ్రీ కత్తి నరసింహ రెడ్డి గారిని, పట్టభద్రుల ఎమ్మెల్సీ గా పోతుల నాగరాజు గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.(2) అధికార పార్టీ అభ్యర్తులు ఇచ్చే తాయిలాలు,గిఫ్ట్ బాక్స్ లను తిరస్కరించి,వారిని ఓడించి గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. (3)ఉపాధ్యాయులు కానీ వారిని,ప్రైవేట్ కార్పొరేట్ రాజకీయ నాయకులను ఓడించి బుద్ధి చెప్పే అవకాశం కల్పించాలని కోరారు.(4) ఉద్యమ కారులు, సుదీర్ఘ కాలం దాదాపు 30 సం.లు ఉపాధ్యాయుని గా, ఉపాధ్యాయ సంఘ నాయకుడైన కత్తి నరసింహారెడ్డి గారిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా తిరిగి గెలిపించా లని ,మరియు పోతుల నాగరాజు గారు ఉద్యమ కారుడని పట్టభద్రుల ఎమ్మెల్సీ గా గెలిపించాలని కోరారు.

About Author