ఈ రాష్ట్రం లో శాంతి లేదు.. ప్రజలకు భద్రత లేదు..
1 min read– వై.నాగేశ్వరరావు యాదవ్ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్
పల్లెవెలుగు వెబ్ డన్ : ఆదివారం డోన్ పట్టణంలో తెలుగుదేశంపార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ వై.నాగేశ్వరరావు యాదవ్ గారు,డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి గారు, రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి వలసల రామకృష్ణ గారు మరియు డోన్ నియోజకవర్గ టిడిపి అబ్జర్వర్ కాటమయ్య గారు, డోన్ మండలం,పట్టణ,ప్యాపిలి మండలం తెలుగుదేశంపార్టీ నాయకుతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంను గ్రామాలలో ప్రారంభించమని పాంప్లేట్లను విడుదల చేసి దిశ నిర్దేశాలను తెలుగుదేశంపార్టీ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నాయకులు, జిల్లా కమిటీ నాయకులు, మండలం అధ్యక్షులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వై. నాగేశ్వరరావు యాదవ్ గారు మాట్లాడుతూ:
రివర్స్ పి.ఆర్.సి. ఇచ్చి ఎరియర్స్ లేకుండా ఉద్యోగులను వంచన చేశారు. 7 విడతల డీఏ బకాయిలకు ఎగనామం పెట్టింది. సి.పి.యస్. రద్దు చేస్తానని చెప్పి ఓట్లు దండుకొని ఇప్పుడు కుదరదని తెగేసి చెబుతున్నారు . … ఇది పంచన కాదా ? ఇచ్చిన హామీని తుంగలో త్రొక్కి జి.పి.యస్.ను అంగీకరించమని.ఒత్తిడి. పెన్షన్ ట్రస్ట్క కట్టవలసిన 10 నెలల బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. ఉన్న పరిశ్రమలను వెల్లగొడుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి ఊసేలేదు. పి.జి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు.ప్రైవేటు విద్యాసంస్థలను నిర్వీర్యం చేసి, లక్షలాది మంది ఉద్యోగులను రోడ్డున పడేసే కార్యక్రమానికి శ్రీకారం. ఉద్యోగ భద్రత కల్పిస్తానని, కనీస వేతనం అమలు చేస్తానని హామీ ఇచ్చి నేడు వారందరినీ తొలగించే కుట్రలకు తెరతీశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చెత్త పన్నును రాబడుతున్న చెత్త ప్రభుత్వం, ప్రజలకు భారంగా మారిన అన్నిరకాల పన్నులు. శాంతి లేదు… ప్రజలకు భద్రత లేదు…అరాచకం రాజ్యం ఏలుతోంది. ప్రశ్నించే వారిపై దాడులు.