వ్యాపార దిగ్గజం గుప్తా ఫౌండేషన్ సేవలు అభినందనీయం
1 min read– మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : గుప్తా ఫౌండేషన్ అవార్డ్స్ తో ఏలూరు నగరానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన సంస్థ గుప్తా ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఏలూరులో 22 లక్షలు వెచ్చించి మోక్ష రథం – ముక్తి రథం వాహనాలను ఆదివారం ఉదయం 10 గంటలకు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని ) కార్యాలయంలో ఏలూరు నగరపాలక సంస్థ వారికి మడుపల్లి మోహన్ గుప్తా ద్వారా గుప్తా ఫౌండేషన్ ప్రతినిధి కె శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పారిశ్రామిక రంగంలో ముడుపల్లి మోహన్ గుప్త అగ్రమిగా నిలిచారని. దేశవ్యాప్తంగా ఎన్నో సేవా అక్రమ కార్యక్రమాలు చేస్తూ హేలాపురి నగర పేరు ప్రఖ్యాతలు ప్రపంచ స్థాయిలో నిలువరింపజేసే విధంగా గుప్తా సేవలు అభినందనీయమని కొనియాడారు, ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆయన కళా రంగం చెందిన వారికి అవార్డుల ప్రధానోత్సవం అందిస్తూ అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలకు తల సేమియా పిల్లలకు రక్తమార్పిడితో వేలాది ప్రాణాలకు దీపం వెలిగించి ప్రాణ ప్రదాతగా నిలిచారని అన్నారు, లక్షల రూపాయల వేచించి గుప్తా ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా కార్పోరేషన్ కు 2 మోక్షరథం, ముక్తి రథం వాహనాలు అందించడం గర్వించదగ్గ విషయంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు, కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొటారు అబ్బాయ చౌదరి, డిప్యూటీ మేయర్లు నూకపైయ్యి సుధీర్ బాబు, జి శ్రీనివాస్ , మార్కెట్ యార్డ్ చైర్మన్ నేరుసు చిరంజీవి, ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ పిళ్ళాం గోల శ్రీలక్ష్మి , కార్పొరేటర్ పిళ్ళాం గోళ్ల శ్రీలక్ష్మి , గుప్తా ఫౌండేషన్ సిబ్బంది, వైసీపీ నాయకులు ,నగరపాలక సంస్థ కార్యాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.