ఉప్పొంగిన.. అభిమానం..
1 min read– జూ.ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమం
పల్లెవెలుగు వెబ్, ఆస్పరి: మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ దివంగత నేత నందమూరి తారక రామారావు మనవుడు నందమూరి తారక రామారావు (జూ.ఎన్టీఆర్) జన్మదిన వేడుకలను అభిమాన సంఘం నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని బిణిగేరిలో సినీహీరో జూ.ఎన్టీఆర్ 39వ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. అంతకు ముందు కరోనా బారి నుంచి జూ.ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు శేషాద్రి నాయుడు ఆధ్వర్యంలో 350 కుటుంబాలకు ఐదు రకాల కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు హనుమంతు, ఎర్రిస్వామి, రవి, బాలు, శేఖర్, శివన్న, శాంతాబాయి, వీరేంద్ర పాల్గొన్నారు.
క్రికెట్ల కిట్ల పంపిణీ… జూ.ఎన్టీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా చింతలముని నల్లారెడ్డి స్వామి దేవాయంలో అభిమానులు పూజలు చేశారు. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి నర్సప్ప ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, మల్లేష్, సంజీవయ్య, కృష్ణ యాదవ్ ,మాబు, మునిస్వామి, గణేష్, రంగముని ,బసవరాజు చేతుల మీదుగా క్రీడాకారులకు క్రికెట్ కిట్లను అందజేశారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి కిట్ల పంపిణీ చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ భర్త రంగన్న ,ఉప సర్పంచ్ భర్త తిక్కయ్య, శివ జూనియర్ ఎన్టిఆర్ సేవ సమితి సభ్యులు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.