PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలులో పోక్సో న్యాయస్థానం ప్రారంభం

1 min read

– చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు త్వరితగతిన పరిష్కారం : కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎన్.శ్రీనివాస రావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎన్.శ్రీనివాస రావు పేర్కొన్నారు.సోమవారం కర్నూలు మున్సిఫ్ కోర్టు భవన సముదాయంలో పోక్సో యాక్ట్ 2012లో భాగంగా చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను నుండి వారికి రక్షణ కల్పించేందుకు గాను ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టును వర్చువల్ విధానంలో అమరావతి నుండి హైకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవ శ్రీ ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు జడ్జి గౌ!! శ్రీ ఆర్.రఘునందన్ రావు, గౌ!! శ్రీ కె.శ్రీనివాస రెడ్డి వారు పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎన్.శ్రీనివాస రావు మాట్లాడుతూ గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ హోమ్స్ పోక్సో యాక్ట్ 2012 క్రింద కర్నూలు జిల్లాలో ఈరోజు ఒక కొత్త కోర్టును ఏర్పాటు చేయడం చేయడం జరిగిందన్నారు. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే చిన్నారులపై జరిగే అత్యాచారాలను త్వరితగతిన తీర్పు చెప్పడం కోసం అలాగే తప్పు చేసిన వారికి వెంటనే శిక్షణ విధించడం కోసం ఈ యొక్క కోర్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా ప్రజలు అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించేందుకు పోక్సో చట్టం తీసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్రమైన చట్టాన్ని రూపొందించిందన్నారు. ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవడం కోసం POCSO చట్టాన్ని అమల్లోకి వచ్చిందన్నారు. వికృత చేష్టలతో పిల్లల జీవించే హక్కును హరించి వారికి ముప్పు వాటిల్లేలా చేస్తే ఈ చట్టం ద్వారా కఠినంగా శిక్షిస్తుందన్నారు. శారీరకంగా, మానసికంగా వారిని వేధిస్తే నిందుతులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 2012లో వచ్చిన ఫోక్సో చట్టం (The Protection of Children from Sexual Offences Act, 2012) 18 ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్ష అమలయ్యేలా ఈ చట్టాన్ని రూపోందించడం జరిగిందన్నారు.కార్యక్రమంలో మహిళా కోర్టు మరియు పోక్సో కోర్టు ఇంఛార్జి జి.భూపాల్ రెడ్డి, మొదటి అదనపు జిల్లా జడ్జి ఎ.శ్రీనివాస కుమార్, నాల్గవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి జి.ప్రతిభా దేవి, ఎస్సీ,ఎస్టీ కోర్టు ప్రత్యేక జడ్జి పాండురంగా రెడ్డి, ఏసిబి జడ్జి శ్రీమతి సునీత, సిబిఐ జడ్జి ఎం.వెంకట రమణ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి టి.కేశవ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి పి.దివాకర్, డిఎల్ఎస్ఎ సెక్రెటరీ సిహెచ్.శ్రీనివాస్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి షర్మిల, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జోష్ణ దేవి, ఎక్సైజ్ కోర్టు మెజిస్ట్రేట్ భార్గవి, మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ ఎం.కళ్యాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.ఆర్.కృష్ణ, న్యాయవాదులు, ఐసిడిఎస్ పిడి కుమారి, కర్నూలు అర్బన్ తహశీల్దార్ విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

About Author