చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కేటాయించాల్సిందే
1 min read– జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
– అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్కర్రి వేణుమాధవ్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బీసీ భవన్: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాల్సిందేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నేడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ఇన్చార్జి అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ పాల్గొని మాట్లాడారు.”జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బీసీ కులగణన, బీసీలకు క్రిమిలేయర్ ఎత్తివేతపైఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద మార్చి 15, 16 తారీఖుల్లో ధర్నా ప్రదర్శన నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమానికి బీసీ ప్రజా మరియు కుల సంఘాలు పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా రిజర్వేషన్లు సాధించుకునేందుకు నడుం బిగించాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలనిట్ట శ్రీనివాస్, యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంబాబు, బిసి నాయకులు అన్వర్ హుస్సేన్, విజయ్, చిన్న బాబు, విద్యార్థి నాయకుడు ఆనంద్ బాబు, దాస్, శివ, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.