PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ వైనతేయ ఇష్టి

1 min read

– గోకులంలో దేవతామూర్తుల యన్త్రస్థాపనము
– గోకులాన్ని సందర్శించిన తెలుగు దేశం పార్టీ నాయకులు గౌరు వెంకటరెడ్డి, ప్రభాకర్ యాదవ్, పెరుగు పురుషోత్తమ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు శివారులోని మామిదాలపాడు సమీపంలో వెలసిన శ్రీగోదా గోకులం నందు ఏడవరోజు శ్రీ వైనతేయ ఇష్టి కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆగమ సార్వభౌమ శ్రీ మద్వాధూల సముద్రాల రమాకాన్తాచార్య స్వామి వారి అధ్వర్యంలో ఈ యజ్ఞం జరిగినది.ఈ సందర్భంగా శ్రీ స్వామీజీ మాట్లాడుతూ శ్రీవైనతేయ ఇష్టి చేస్తే సత్సంతానంతో పాటు సమస్తమైన శుభాలు కలుగుతాయని వివరించారు. దశరథ మహారాజు ఈ యాగం చేసి రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులను పొందారని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ గోదాగోకులాన్ని దర్శించుకోవడం, ఇంత గొప్ప దేవస్థానం కర్నూలు నగరంలో ప్రతిష్టాపన కావడం ఈ ప్రాంత ఆస్థికుల పుణ్యఫలితంగా కొనియాడారు. వారివెంట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తమ రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. వారిని శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామీజీ, దుశ్శాలువ, జ్ఞాపికలతో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రయాగరాజ్ ప్రపర్ణ రాఘవ జీయర్ స్వామీజీ, గోదాగోకులం వ్యవస్థాపక చైర్మన్ మారం నాగరాజ గుప్త మేనేజింగ్ ట్రస్టీ పల్లెర్ల నాగరాజు,వేద పండితులు శ్రీమన్నారాయణా చార్యులు, మాధవాచార్యులు, భగవాన్ ఆచార్యులు, రమేశ్ ఆచార్యులు,రంగనాథాచార్యులు, వంశీకృష్ణమాచార్యులతో పాటు అనేక మంది ఋత్విక్కులు పాల్గొన్నారు.
అఖండ హరినామ సంకీర్తనా యజ్ఞం అలరించిన కూచిపూడి నృత్యం
గోదాగోకులంలో జరుగుతున్న ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన 20 గ్రామాల నుండి భజన బృందాలు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు హరినామ సంకీర్తనా మహాయజ్ఞం జరిగినది. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కుమారి ముడియం రేణుశ్రీ ప్రదర్శించిన కూచిపూడి నృత్యం వీక్షకులను ఎంతగానో అలరించింది. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి , శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి పీఠాధిపతులు శ్రీశ్రీ యల్లప్ప స్వామి, వైద్యం రామానాయుడు, పాలాది సుబ్రహ్మణ్యం, యం.రామభూపాల్ రెడ్డి, ఎస్.మహేశ్వరరెడ్డి, ఇల్లూరి రామయ్య‌‌‌, బాలసుధాకర్, చిత్రాల వీరయ్య‌‌‌, భూమా కృష్ణ మోహన్, వేముల జనార్ధన్, రవిప్రకాశ్, లింగం కృష్ణ మోహన్, గోదాగోకులం పరివారంతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author