జిల్లా విస్తృత స్థాయి సమావేశం
1 min read– భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలుపు జగన్ అరాచక పాలన అంతానికి నాంది
– యువగళం తో కార్మిక సమస్యలు వెలుగులోకి రావాలి
– కార్మిక లోకం మొత్తం అడుగులో అడుగు వేసి లోకేషన్న తో కలిసి నడుద్దాం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : కర్నూలు జిల్లాపార్టీ కార్యాలయంలో (28-02-2023) టి యన్ టి యు సి జిల్లా అధ్యక్షుడు Y. నరసింహులు అధ్యక్షతన యువగళం పాదయాత్ర ని జయప్రదం చేయడానికి సన్నాహకంగా టి యన్ టి యు సి జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులు గా పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు,రాష్ట్ర టి యన్ టి యు సి అద్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు గారు, జోన్ 5 కోఆర్డినేటర్, ప్రధాన కార్యదర్శి అశోక కుమార్ గారు, TNTUC రాష్ట్ర గుడిసి నరసింహులు యాదవ్ గారు, జస్వంత్ రెడ్డి గారు హాజరయ్యారు.ఈ సమావేశంలో రఘురామరాజు మాట్లాడుతూ టి యన్ టి యు సి ని బలోపేతం చెయ్యాల్సిన అవసరం ఉంది దానికి టి యన్ టి యు సి నాయకులు అందరూ మార్చిలో జరగబోయే పట్టభద్రుల MLC ఎన్నికల్లో మన అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక టీ యన్ టి యు సి నాయకులపై ఉంది. ప్రతి నియోజకవర్గంలోని టి యన్ టి యు సి నాయకులు ఆ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉద్యోగులను,టీచర్లను,విద్యుత్ ఉద్యోగులను,ఆర్ టి సి ఉద్యోగులను, వివిధ రంగాల్లో పని చేస్తున్న పట్టభద్రులను కలిసి వారికి రాష్ట్ర పరిస్థితిలు వివరించి మన అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరుతున్నాను అని అన్నారు.అలాగే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 400 రోజులపాటు 4000 కిలోమీటర్ల పాటు చేపట్టిన యువగళం పాదయాత్ర మన జిల్లా పరిధిలోకి వచ్చిన దగ్గర నుంచి పూర్తి అయ్యే వరకు మనము అందరమూ ఆయనతో కలిసి నడవాలని కోరారు. అలాగే వివిధ కార్మిక వర్గాల సమస్యలు తెలుసుకొని వాటిని లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అశోక్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు మన రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవుతుందా అని ప్రశ్నించారు. మనము అందరమూ మన హక్కులు మరచిపోయి పిరికి తనముతో బ్రతుకుతున్నాము. అవన్నీ పోవాలి అంటే ఓటు అనే ఆయుధం తో జగన్ రెడ్డి కి బుద్ధి చెప్పాలి దానికి రేపు జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో మన అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి గెలుపు కు మనము అందరమూ కృషి చేయాలన్నారు.గుడిసి నర్సింలు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది ఈ పలను అంతమందించాలని అలాగే మార్చిలో జరిగే పట్టుబద్దుల ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీకి సెమీఫైనల్ లాంటివని ఖచ్చితంగా భూమి రెడ్డి రాంభూపాల్ రెడ్డి గెలిపించి జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అనడం జరిగింది. ఈ సమావేశంలో టి యన్ టి యు సి కర్నూలు టౌన్ అధ్యక్షుడు పోల్ రాజ్, రామకృష్ణ, ప్రభాకర్, కర్నూలు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.