PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగన్ రెడ్డి రైతు భరోసా కాదు.. రైతు దగా..

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు గద్దె ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ ను జగన్ రెడ్డి ఇస్తున్నట్టుగా నమ్మిస్తున్నాడని, ఇప్పటికే రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేసిందని అన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రజల సొమ్మును కోట్లాది రూపాయలు దుబారా చేస్తూ తెనాలిలో సభ, ప్రచార ఆర్భాటాలు, పేపర్ యాడ్స్, రోడ్డుకి ఇరువైపులా భారీ కేట్లు పెట్టి ఎంత సాధిస్తారు జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి ప్రచార ఆర్భాటం పరాకాష్టకు చేరింది అన్నారు. జగన్ రెడ్డి హయాంలో రైతు పతన వ్యవస్థకు చేరాడు అన్నారు. అన్నం పెట్టే రైతన్నల మీద కూడా అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేయించిన ఘనుడు జగన్ రెడ్డి అన్నారు. రైతు పండించిన మొక్కజొన్న పంట మీద కూడా జగన్ రెడ్డి రంగుల ప్రతాపం చూపించారని ఎద్దేవా చేశారు.గత చంద్రబాబు గారి హయాంలో రైతులకు పంటల బీమా సౌకర్యం కల్పించామని, ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందించామని, ఎరువులు- విత్తనాలు సబ్సిడీ ద్వారా రైతులు అందించామని,తడిసిన ధాన్యాన్ని రైతు దగ్గర నుండి ప్రతి గింజని కొని వారిని ఆదుకున్నామని,రైతులకు రుణమాఫీ చేసి రాష్ట్రంలోని కొన్ని లక్షల మంది రైతులు జీవితాల్లో ఆనందం నింపామని, గ్రామాలలోని రైతులకు సబ్సిడీతో కూడిన ట్రాక్టర్లు అందించిన ఘనత చంద్రబాబు గారిది అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తిచేసి కాలువల చివరి వరకు నీరందించిన ఘనత చంద్రబాబు గారిది అని, పోలవరాన్ని 73% పూర్తి చేస్తే జగన్ రెడ్డి పాలన తర్వాత దాన్ని రివర్స్ ట్రెండింగ్ పేరుతో నాశనం చేసి రాష్ట్ర రైతాంగానికి జీవనాడి లాంటి పొలవరాన్ని అటకెక్కించారన్నారు. గ్రామాలలోని రైతులకు సబ్సిడీతో కూడిన ట్రాక్టర్లు చంద్రబాబు గారు అందించారని, పట్టిసీమను నిర్మించి రైతులకు నీళ్లు అందించిన ఘనత చంద్రబాబు గారిదని, జగన్ రెడ్డి సొంత జిల్లా కడపకు సాగు తాగునీరు అందించిన భగీరధుడు చంద్రబాబు గారు అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో అవగాహన లేని మంత్రులను పెట్టుకుని రాష్ట్రంలోని రైతుల జీవితాలతో చెలగాటంలాడుతున్నాడు అన్నారు. జగన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆర్బికే కేంద్రాలు దళారీ కేంద్రాలుగా తయారయ్యాయని విమర్శించారు. రైతుల ఈక్రాప్ నమోదు లో కూడా దళారీ వ్యవస్థ విలయతాండవం చేస్తుందన్నారు. వైసీపీ నాయకులే దళారుల అవతారం ఎత్తి రైతులను దోచుకుంటున్నారన్నారు.అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు స్థిరీకరణ నిధి ద్వారా సొమ్మును వెంటనే రైతులకు విడుదల చేయాలని,రైతు పండించిన ప్రతి గింజని ప్రభుత్వం కొనుగోలు చేసి వెంటనే రైతుకు డబ్బులు చెల్లించాలని, రైతులందరికీ పంట బీమా సౌకర్యం( ఇన్సూరెన్స్) వెంటనే కల్పించాలని, కౌలు రైతులను జగన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని,ఆక్వా రంగంలో దళారులను అరికట్టి, ఎగుమతులు ప్రోత్సహించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కువగా నెలకొల్పాలని, సకాలంలో సబ్సిడీతో కూడిన ఎరువులు, విత్తనాలు రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. రాబోవు రోజుల్లో రాష్ట్రంలోని రైతాంగం ఆగ్రహానికి జగన్ రెడ్డి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు.

About Author