ఘనంగా జాతీయ వైజ్ఞానిక దినోత్సవ వేడుకలు
1 min read– విద్యార్థుల విభిన్న ఆలోచనలతో రూపమిచ్చారు
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : గోనెగండ్ల మండల పరిధిలోని ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ నందు జాతీయ వైజ్ఞానిక(సైన్స్) దినోత్సవమును ప్రిన్సిపల్ షాహిన్ పర్వీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచామన్నారు.పలువురు విద్యా ర్థులు తమ విభిన్న ఆలోచనలకు పదును పెట్టి వాటికి రూపమిస్తున్నారు. సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. పర్యావ రణ హితం, ఆరోగ్యం, పరిశుభ్రత, స్మార్ట్ బ్రిడ్జ్, బ్లూటూత్ కార్, సాఫ్ట్వేర్, యాప్ లు, గణిత నమూనాలు, ట్రాఫిక్ నియమాలు, ప్రమాదాల నివారణ వంటి ప్రాజెక్టులతో పలు సమ స్యలకు పరిష్కార మార్గాలు చూపారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో విద్యార్థులు తయారుచేసిన నమూనాలను పరిశీలించేందుకు జడ్జీలుగా కర్నూలు అశోక్ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ రవీంద్రనాథ్, అసోసియేట్ ప్రొఫెసర్ వలి బాబు లు వ్యవహరించగా మండల విద్యాధికారి వినోద్ కుమార్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ పరమేశ్వర్ రెడ్డి లు ప్రదర్శనలను తిలకించారు. అనంతరం స్మార్ట్ బ్రిడ్జి నమూనా ను తయారుచేసిన విద్యార్థులు వెంకటరాముడు, మా భాష ,దుర్గా ప్రసాద్ లకు మొదటి బహుమతిని, గ్లోబల్ వార్మింగ్ తయారుచేసిన పదవ తరగతి విద్యార్థులు లోకేశ్వర్ రెడ్డి కి రెండవ బహుమతిని, జెసిబి ఎనర్జీ కన్సర్వేషన్ త్రో హైడ్రాలిక్ ప్రెషర్ నమూనా తయారుచేసిన ఎనిమిదవ తరగతి విద్యార్థులు సూర్యనారాయణ అమృత్ లకు మూడవ బహుమతి మెమొంట్లను అందజేసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన నమూనాలతో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.