PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రవీంద్రలో సినర్జీ 2023

1 min read

పల్లెవెలుగు కల్లూరు అర్బన్ : నేడు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అబ్బాస్ నగర్ లోని రవీంద్ర విద్యాసంస్థల్లో ఘనంగా సైన్స్ డేను సినర్జీ 2K23 పేరుతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ తరగతుల విద్యార్థులు వారు తయారు చేసిన సైన్స్ నమూనాలు చాలావరకు ఆలోచింపజేసే విధంగా, సృజనాత్మకంగా ఉంటూ, రాబోయే రోజుల్లో కొత్త ప్రయోగాలకు నాంది పలికే విధంగా తయారు చేశారు. ఇక్కడ ఇంటర్ స్కూల్స్ కాంపిటీషన్ జరిగింది. రవీంద్ర విద్యానికేతన్ ,రవీంద్ర పబ్లిక్ స్కూల్ ,రవీంద్ర ఐ .సి విభాగము లలో పోటీ నిర్వహింపబడింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవీంద్ర విద్యాసంస్థల అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ జి. మమతా మోహన్ గారు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ప్రారంభ ఉపన్యాసంలో విద్యార్థులు తమలో ఉన్న నైపుణ్యశక్తిని వెలికి తీయాలి అంటే ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్క విద్యార్థి కూడా వారి నమూనాలు భవిష్యత్తులో మానవ విజ్ఞాన అభివృద్ధి కోసం, కొత్త శాస్త్ర సాంకేతిక విజ్ఞాన విప్లవం కోసం నాంది పలకాలని తెలియజేశారు. అనంతరం రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి .పుల్లయ్య మాట్లాడుతూ సైన్స్ అన్నది మానవాళి అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది అని ప్రతి పరిశోధక నమూనా ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని ప్రశంసించారు.విద్యాసంస్థల వైస్ చైర్మన్ జి .వంశీధర్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉత్తమ నమూనాలుగా ఎంపికైన బ్లైండ్ స్టిక్ {తారక్ సంవిత్ ,వేదసాయి కీర్తన్). ఆర్ యఫ్ ఐడి డోర్ లాక్ సిస్టమ్( జి.జైత్రి సాయి మీనాక్షి, దివ్యశ్రీ ) కు బహుమతులు మరియు ప్రశంసాపత్రాలను ముఖ్య అతిథి అందజేశారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులు, తల్లితండ్రులు టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

About Author