PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన గడివేముల లోని స్థానిక శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాలలో మంగళ వారం నాడు విద్యార్థినీ విద్యార్థులకు సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు పలు రకాల సైన్స్ పరిజ్ఞానాన్ని కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శనలు ప్రదర్శించారు.ప్రదర్శనలో రాణించిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను శ్రీ రాజ రాజేశ్వరి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాఘవేంద్ర ప్రధానం చేశారు.ఈ సందర్భంగా కరస్పాండెంట్ రామేశ్వర రావు మాట్లాడుతూ….. సైన్స్ పరంగా రాణిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని,జాతీయ విజ్ఞాన దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం ఎంటంటే.. ముఖ్యంగా రోజువారీ జీవితంలో సైన్స్ ప్రాముఖ్యత, దాని ఉపయోగాలను ప్రజలలో వ్యాప్తి చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, సాంకేతిక విద్య, నైపుణ్యాల వృద్ధి, భవిష్యత్‌లో సైన్స్ పరంగా సాధించాల్సిన ప్రగతి పరంగా విద్యార్థులు,యువతను ప్రోత్సహించడం.అలాగే సర్ సీవీ రామన్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ జాతీయ సైన్స్ డే ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

About Author