రక్తహీనత పిల్లలకు స్కాలర్స్ స్కూల్ శివప్రసాద్ చేయూత
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అంగన్వాడీ కేంద్రంలోని రక్తహీనత కలిగిన చిన్నారులకు తన వంతుగా చేయూతనిచ్చేందుకు పట్టణంలోని స్కాలర్స్ స్కూల్ కరస్పాండెంట్ కాళ్ళూరి శివప్రసాద్ ముందుకు వచ్చారు. బధవారం పట్టణంలోని 27వ అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన సందర్శించి రక్తహీనత కలిగిన పిల్లల వివరాలు తెలుసుకొని వారికి మంచి పౌష్టిక ఆహారం రాగిపిండి, పెసలు, అలుసందలు, చిక్కీలు, అరటి పండ్లు కేంద్ర నిర్వాహకులకు అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. అక్కడే ఉన్న తల్లులకు చిన్నారులకు ప్రభుత్వం ఇస్తున్న పౌష్టికాహారం వారికి సక్రమంగా అందించాలని, గర్భవతులు కూడ మంచి ఆహారం తీసుకోవాలని తమ వంతు సహాకారం అంధిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ ఆశీర్వాదమ్మ, మహిళా పోలీసు భవితరోషన్, అంగన్వాడీ కార్యకర్త జి.పుష్పలత, ఆయా. చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.