శనగ విత్తనాలను తక్షణమే కొనుగోలు చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మిడుతూరు మండల వ్యవసాయ అధికారి ఎం. పీరునాయక్ కు వినతి పత్రాన్ని అందజేశారు.అనంతరం ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు జిల్లా కమిటీ సభ్యుడు వి.రామకృష్ణ వి నాగరాజు,ఓబులేష్,సిఐటియు తాలూకా కార్యదర్శి లింగస్వామి మాట్లాడుతూ ర బి సీజన్లో వేల రూపాయలు అప్పులు తెచ్చి పంటలు పండించడం జరిగిందని అయితే ప్రభుత్వము గిట్టుబాటు ధర కేవలం 5,352 రూపాయలు మాత్రమే ప్రకటించిందని దీనివల్ల రైతుల నష్టం జరుగుతుందన్నారు కనీసం క్వింటాలుకు 8వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా పంట కోతకు వచ్చి నేల మాసాలు కావస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పంటను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారుల చేతిలో శనగ రైతులు మోస పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.గత నెల 25వ తేదీ కొనుగోలు చేస్తామని ప్రకటించి వారం రోజులు కావస్తున్నా నేటికీ ఆర్బికే సెంటర్లకు సొసైటీల ద్వారా గోనె సంచులు ట్యాగులు అందించలేదన్నారు. ఏఓ పీరునాయక్ మాట్లాడుతూ రైతులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క రైతు దగ్గర శనగలు కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు.