PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆత్మకూరు ఏపీపీగా ఆసీఫ్ అలీ ఖాన్

1 min read

– సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: వెలుగోడుకు చెందిన అడ్వకేట్ ఖురాసాని ఆసీఫ్ అలీ ఖాన్ నియామికులయ్యారు. గురువారం ఆయన మాట్లాడుతూ తనను ఫిబ్రవరి 28వ తేదీ ఏపీపీగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. ఉత్తర్వులు జారి అయినప్పటి నాటి నుండి మూడు సంవత్సరములు పదవి కాలం కొనసాగుతుందని అన్నారు. ఉమ్మడి జిల్లా కర్నూలు నందు మొదట జి నాగలక్ష్మి రెడ్డి వద్ద జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ నిర్వహించారని అన్నారు. అనంతరం ఆత్మకూరు కోర్టు నందు ప్రాక్టీస్ చేశారు. ఆత్మకూరు బార్ అసోసియేషన్ కు రెండు పర్యాయాలు జనరల్ సెక్రెటరీగా ఎన్నుకోబడ్డారని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నోటరీ గా, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ సెక్రెటరీ గా ఉన్నారు. తన నియామకానికి సహకరించిన శ్రీశైల శాశన సభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి, నియోజక వర్గ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నంద్యాల పార్లమెంట్ అధికార ప్రతినిధి దేశం తిరుపం రెడ్డి, మండల అధ్యక్షులు అంబాల ప్రభాకర్ రెడ్డి, జడ్పిటిసి అమీరున్ బి, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ సులేమాన్, ఎంపీపీ లాలం రమేష్, వెలుగోడు సర్పంచ్ వేల్పుల జయపాల్, ఉపసర్పంచ్ ముబీనా, సహకార సంఘం అధ్యక్షుడు వంగల నాగేశ్వర రెడ్డి,టౌన్ ప్రెసిడెంట్ ఇలియాస్ ఖాన్, విజయ భాస్కర్ రెడ్డి, సుదర్శనం లిటిల్ ఏంజెల్స్ పాఠశాల కరస్పాండెంట్ ఇమ్మానియేల్, బృందావన్ కరెస్పాండెంట్ ఫయాజ్ అలీ ఖాన్, రషీద్ ఖాన్, అమీర్ అలీ ఖాన్, మహమ్మద్ ఖాన్, మండల ప్రధాన నాయకులు కాంట్రాక్టర్ రామ్మోహన్ రెడ్డి, మదీనా షంషీర్, సయ్యద్ షాషా ఖాద్రీ ,అంజాధ్ అలి, సయ్యద్ మీర్, మున్న, జెడ్పీటీసీ శంకర్ రెడ్డి కౌన్సిలర్లు యునుస్, సుల్తాన్, బొర్వెల్ రహిం, విజయ్, హరి,రషీద్, హర్షం వ్యక్తం చేశారు. న్యాయవాదులు సుధాకర్ రెడ్డి,నూర్ అహ్మెద్, రామకృష్ణుడు, శ్రీధర్ అడిగే, మురళి మోహన్, రవికుమార్,నగేష్, సిద్దిక్, ఆత్మకూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గిరి రాజు, సెక్రెటరీ శంకర్ లు అభినందనలు తెలిపారు. ఏపీపీ ఆసీఫ్ అలీ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు.

About Author