ఆడపిల్లలను రక్షించండి.. ఆడపిల్లలకు చదువు చెప్పండి
1 min read– ఎన్ సిడి మరియు ఆర్ బి ఎస్.కె. ప్రాజెక్ట్ అధికారిణి డా.సిహెచ్ మానస
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : భారత దేశంలోని బాలికల సంక్షేమం కోసం వారి చదువులకోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. డి. ఆశ తెలిపారు. గురువారం స్ధానిక కస్తూరిభా నగరపాలక బాలికోన్నత పాఠశాల నందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో – బేటీ పఢావో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. డి. ఆశ విద్యార్ధినులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆడపిల్లలను రక్షించడం, ఆడపిల్లలను చదివించడం కోసం ఈ పథకం అమలు చేస్తారని చెప్పారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యములను వివరిస్తూ ఆడపిల్ల మనుగడ మరియు భధ్రతను నిర్ధారించడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ పథకం ఆడపిల్లల విద్యాభ్యాసానకి కూడా తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వెల్లడించడం చట్టప్రకారం నేరమని వీటిపై స్కానింగ్ సెంటర్లలో ప్రజలకు అవగాహన కల్పించడానికి పోస్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, స్కానింగ్ సెంటర్ల యాజమాన్యం చట్టాన్ని ఉల్లఘించినట్లైయితో వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె వెల్లడించార. ఈ పథకం పొందడానికి 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లలతో ఉన్న కుటుంబం, ఆడపిల్లల పేరుతో ఏ బ్యాంకులోనైనా సుకన్య సమృద్ధిఖాతా(ఎస్ఎస్ఎ) ఖాతాను తెరిపించాలని తెలిపారు. ఈ పథకానికి ఆడపిల్ల భారతీయురాలైయుండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్ సిడి మరియు ఆర్ బిఎస్ కె ప్రాజెక్ట్ అధికారిణి డా. సిహెచ్ మానస మాట్లాడూ బేటీ బచావో – బేటీ పఢావో పథకం బాలికలకు ఒక వరం లాంటిదన్నారు. ఈ పథకంపై బాలికలు అవగాహన తెచ్చుకొని వారి తల్లిదండ్రులకు పథకం ప్రయోజనాలను వివరించి సుకన్య సమృద్ధి ఖాతా తెరిపించుకోవాలని తెలిపారు. ఈ పథకం బాలికలకు చదువులకు ఆర్ధిక సహాయం అందిస్తుందని ఈ పథకాన్ని బాలికలు ఎక్కువ అభ్యాసనం చేయడం వల్ల స్వయం సమృద్ధి సాధించగలుతారని, బాలికలు సరైన వయస్సులో వివాహం చేసుకుంటారని, ఆడపిల్లలను అక్షరాస్యులుగా చేయడం జరుగుతుందని, ఈ పథకం ద్వారా క్షీణిస్తున్న చైల్డ్ సెక్స్ రేషియో లింగ అసమానతలు తొలగించే లక్ష్యంతో 2015లో కేంద ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ పథకం బ్యాంకు, పోస్టాఫీసు లలో అందుబాటులో ఉంటుందన్నారు. ఈ పథకాన్ని బాలికలందరూ వినియోగించుకోవాలని డా. మానస కోరారు. ఈ కార్యక్రమంలో డిసిపిఓ సూర్యచక్రవేణి, సిడిపివో పద్మవతి, డిఐఓ డా. నాగేశ్వరరావు, డా. భార్గవి, స్కూలు ఇన్ ఛార్జి కృష్ణమోహన్, నాగరత్నం , హెల్త్ ఎడ్యుకేషన్ విజయ్ కుమార్, పాఠశాల బాలబాలికలు, తదితరులు పాల్గొన్నారు.