PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డిమాండ్లు అమలుచేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాదోరణి

1 min read

– ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికే మార్చి 9 నుండి ఉద్యమానికి సిద్దపడుతున్నాం..
– బొప్పరాజు .. పలిశెట్టి దామోదరరావు వెళ్లడి..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ,ఉపాధ్యయ,కార్మిక,రిటైర్డు కాంట్రాక్టు & ఔట్ సోర్శింగు ఉద్యోగుల దీర్ఘకాలిక ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యల పరిష్కారానికి గత ఏడాది పిభ్రవరి నెలలో 11 వ పిఆర్శీ అమలులో భాగంగా జరిగిన ఉద్యమం సందర్భంగా గౌఃముఖ్యమంత్రిగారు,మంత్రివర్గ ఉపసంఘం అంగీకరించిన డిమాండ్లు అమలుచేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాదోరణి తో సమస్యలు పరిష్కారంలో జాప్యం చేస్తున్నందునే మార్చి 9 నుండి ఏప్రీల్ 3 వరకు దశలవారిగా ఉద్యమానికి సిద్దపడి, ఆందోళణా కార్యక్రమాలు ప్రారంబించ బోతున్నామని,ఇది ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటం కాదని ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు సాదనకోసం చేపడుతున్న పోరాటమని ఏపిజెఏసి అమరవాతి చైర్మన్ బొప్పరాజువెంకటేశ్వర్ల,సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు తెలిపారు.ఈ రోజు గురువారం ఏలూరు రెవిన్యూభవన్ లో ఏలూరు/పశ్చిమగోదావరి రెండు జిల్లాల ఉద్యోగులను ఉద్యమానికి సిద్దం చేసేందుకు ముందుగా జిల్లా, డివిజన్ స్థాయి అన్నీ శాఖల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశాంలో ముఖ్యఅతిధులుగా పాల్గొన్న బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావు లు మాట్లాడారు.ఈ సమావేశం ప్రారంభంలో ఏపిపిటిడి(ఆర్టీసి)ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపిజెఏసి అమరారతి మాజీ సెక్రటరీ జెనరల్ వై.వీ.రావు ఇటీవల అకాల మరణానికి చింతిస్తూ ఏలూరు జిల్లా ఆర్టీసి ఎంప్లాయిస్ నాయకులు ఏర్పటుచేసిన సంతాపసభలో ముందుగా వారికి నివాళులు అర్పించి ఆయన సేవలను నాయకులు కొనియాడారు. ఈసందర్బంగా ఏపిజెఏసి అమరావతి నాయకులు మాట్లాడుతూ స్వయానా ఉద్యోగసంఘాయకు గౌఃముఖ్యమంత్రీగారే ఇచ్చిన హామీలు అమలు కానప్పుడు ఇంకా ఎవరికి చెప్పుకోవాలో అర్దంకాని పరిస్దితిలో ఈ ఉద్యమానికి సిద్దపడ్డాం. ఉద్యోగుల జీతభత్యాల కొరకు కేటాయించిన బడ్జెట్ ఎమౌతుందో తెలియడంలేదు.అసలు మా డబ్బులు ఎవరికి మళ్లీస్తున్నారు.మాకు ప్రతి నెలా పనిచేసిన కాలానికి ఒకటో తారీకు జీతాలు/పెన్సస్ లు ఎందుకు ఇవ్వరు. మా జీతాలు/ పెన్సస్ లు కోసం నిధులు కేటాయించలేదా?కేటాయిస్తే, ఎందుకు ప్రతి నెల జీతాలు 20వ తేదీ వరకు ఇస్తూనే ఉన్నారు?మేము దాచుకున్న డబ్బులు ఏమయ్యాయి? ఒకవేళ మా డబ్బులు ప్రభుత్వం వాడుకొకపోతే, ఎందుకు మేము కోరుకున్నప్పుడు మా కుటుంబ అవసరాల కోసం చెల్లించడం లేదు, మా డబ్బులు వాడుకొనే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు? మాకు రావల్సిన అరియర్సు/డిఏ బకాయిలు,కొత్త డిఏ, లీవ్ ఎన్ క్యాష్ మెంట్లు,మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులు ఎందుకు సకాలంలో చెల్లించడం లేదు,ఇలాంటి అనేక ఆర్దికపరమైన అంశాలు అన్నింటీపైన స్పష్టమైన లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని, అలాగే దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ అర్ధికేతర సమస్యలు కూడా తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ముందుగా AP JAC అమరావతి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ప్రకారం మార్చి 9 నుండి రాష్ట్రవ్యాప్తంగా చేపట్ట బోవు ఉద్యమం దశలవారిగా ఉదృతం అవుతుందని వారు తెలిపారు. ఈ ఉద్యమం వలన ప్రజలకు ఎటువంటీ అసౌకర్యాలు కలిగినా సరే దానికి ఉద్యోగులుగా మేము బాద్యులుంకాదని, దీనికి పూర్తిగా ప్రభుత్వం భాధ్యత వహించాలని…కారణం ఉద్యోగులపై ప్రభుత్వం అవలంబించిన నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఏపిజెఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు స్పస్టం చేసారు.అలాగే ఏపి జెఏసి అమరారతి రాష్ట్రకమిటి ప్రకటించిన ఉద్యమషెడ్యూల్ను విజయవంతం చేయాలని, సంఘాలతో సంబంధం లేకుండా, ప్రతి ఉద్యోగి ఉద్యమంలో పాల్గొని ఉద్యమాన్ని జయప్రదం జేయడం ద్వారా మన ఆర్థిక, ఆర్ధికేతర సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కోరుతున్నాము అని బొప్పరజు & పలీసెట్టి దామోదర్ రావు తెలిపారు.AP JAC అమరావతి లోని అన్నీ సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన ఏలూరు జిల్లా చైర్మన్ కే.రమేష్ గారు వారి ప్రధాన కార్యదర్శి బి.రాంబాబు, అలాగే కొత్తగా ఏర్పడిన పచ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ మరియు శ్రీ యస్.శివ శంకర్ వారి ప్రధాన కార్యదర్శి శ్రీ కె.ఫణికుమార్ గార్లు మాట్లాడుతూ ఏలూరు మరియు పశ్చిమ గోదావరి రెండు జిల్లాలలో రాష్ట్ర కమిటీ ప్రకటించిన ఉద్యమాన్ని విజయవంతం చేసే భాధ్యత తీసుకుంటామని, భవిష్యత్ లో AP JAC అమరావతి రాష్ట్ర కమిటీ చేపట్టే ఎలాంటి ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
ఏలూరు జిల్లాలోని వివిధ శాఖల కార్యాలయాల సందర్శన
ఉద్యమ కార్యాచరణలో పాల్గొనమని సిబ్బందినీ స్వయంగా ఆహ్వానించిన తో రాష్ట్ర జేఏసీ కమిటీ
ఈ సమావేశం అనంతరం ఈనెల 9 నుండి చేపడుతున్న చేపడుతున్న ఉద్యమానికి సహకరించి అందరు పాల్గోనాలని విజ్ఞప్తి చేస్తు ఏలూరులో కలెక్టర్ కార్యాలయంతో, ట్రజరీ, కో-ఆపరేటివ్, డిఆర్డిఏ, ఎపిజిఎల్ఐ, సివిల్ సప్లయి, సర్వేల్యాండురికార్డ్సు,ఆర్.డి.ఓ, ఒమెన్ & చైల్డువెల్పర్ మరికొన్ని ప్రభుత్వజిల్లా కార్యాలయాల సిబ్బందిని ఏపిజెఏసి అమరావతి రాష్ట్రనాయకులు బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావు,యస్. మల్లేశ్వరరావు,ఎ.సాంబశివరావు తోపాటు ఏలూరు జిల్లా చైర్మన్, ప్రధానకార్యదర్శులు కె.రమేష్ కుమార్,బి.రాంబాబు,పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ యస్.శివశంకర్, ప్రధాన కార్యదర్శి కె.ఫణికుమార్ తో పాటు అధికసంఖ్యలో వివిధ డిపార్టుమెంట్ ఉద్యోగులు పాల్గొన్నారు. వారందరినీ స్వయంగా బొప్పరాజు & పలసెట్టి దామోదర్ లు కలిసి ఉద్యమాన్ని విజయవంతం చేయాలి కోరారు. ఉద్యోగులను కలసి నప్పుడు వారి బాదలు,ఇబ్బందులు,సమస్యలు కూడా ఏపిజేఏసిఅమరావతి నాయకులు దృష్టికి తెచ్చారు.

About Author