PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిఎంజెవై కార్డులు వచ్చే గురువారం నాటికి పూర్తి చేయండి

1 min read

– జగనన్న రీసర్వే పై అపోహలు విడనాడండి : జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పిఎంజెవై కార్డులను వచ్చే గురువారం నాటికి పూర్తి చేయడంతో పాటు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీసర్వే పై అపోహలు విడనాడాలని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు పేర్కొన్నారు.గురువారం ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఎమ్మిగనూరు అర్బన్ మరియు రూరల్ లేఔట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.బనవాసి గ్రామ సచివాలయంలోని హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, తదితర రికార్డులను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు పరిశీలించారు. పిఎంజెవై కార్డులకు సంబందించిన వివరాలను వాలంటీర్ల చేత సేకరించి వచ్చే గురువారం నాటికి అందరికీ అందజేయాలన్నారు. జగనన్న రీసర్వే పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని వారికి ఎటువంటి సమస్యలు ఉన్న మొబైల్ మేజిస్ట్రేట్ గా డిప్యూటీ తహశీల్దార్ నియమించడం జరిగిందని, వారి ద్వారా సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందని అక్కడికి వచ్చిన గ్రామస్థులకు జిల్లా కలెక్టర్ వివరించారు. రీసర్వే అప్పీల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు.అదే విధంగా రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన కియోస్కి ఆపరేషన్ మిషన్ పరిశీలించి వాటిలో డేటా ఫీడ్ చేసే విధానాన్ని వ్యవసాయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ కాలానికి సంబంధించి విత్తనాల పంపిణీ ఎంత చేశారు వాటిని ఎక్కడ నమోదు చేశారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ-కెవైసిని పూర్తి చేయించాలని వ్యవసాయ సిబ్బందిని ఆదేశించారు. అలాగే గ్రామాలలో రైతులకు అందించాల్సిన సహాయ సహకారాలపై వ్యవసాయ సిబ్బందికి అవగాహన కల్పించారు.ఎమ్మిగనూరు అర్బన్ మరియు రూరల్ లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల పురోగతి పై హౌసింగ్ డిఈని అడుగగా మొత్తం ఎమ్మిగనూరు రూరల్ (ఎనుగులబాల) లేఅవుట్ నందు 160 ఇళ్లు మంజూరు చేశామని వాటిలో బేస్మెంట్ లెవెల్ – 82, రూఫ్ లెవెల్ – 2, రూఫ్ కాస్ట్ – 4, పూర్తైన ఇళ్లు – 3 మిగిలిన 69 ఇళ్లు మొదులు పెట్టాల్సి ఉందన్నారు, అదే విధంగా ఎమ్మిగనూరు అర్బన్ నందు 1158 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో బేస్మెంట్ లెవెల్ – 770, రూఫ్ కాంక్రీట్ – 6, పూర్తైన ఇళ్లు – 5 వీటిలో ఇంకా 371 ఇళ్లు ప్రారంభించాల్సి ఉందని హౌసింగ్ డిఈ జిల్లా కలెక్టర్ కు తెలిపారు. మొదులు కానీ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. లేఅవుట్ కు అప్రోచ్ రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీ రాజ్ సిబ్బందికి జిల్లా కలెక్టర్ సూచించారు. అదే విధంగా ఇంటి నిర్మాణాలు పూర్తైన వాటికి వెంటనే మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారి వెంట ఎమ్మిగనూరు తహశీల్దార్ జయన్న, ఎమ్మిగనూరు మున్సిపల్ కమీషనర్ గంగిరెడ్డి, హౌసింగ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author