PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివాహానికి ఎమ్మెల్సీ అభ్యర్థి కొత్తూరు లక్ష్మీనారాయణ హాజరు

1 min read

పల్లెవెలుగు వెబ్ అనంతపురం : జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలోని గుంటి కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన వివాహానికి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కొత్తూరు లక్ష్మీనారాయణ హాజరయ్యారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన బండారు వెంకటరాముడు లక్ష్మీదేవి దంపతుల ప్రథమ పుత్రిక విజయకు అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం బూజేడు గ్రామానికి చెందిన పడిగల ముత్యాలు, తిప్పక్క కుమారుడు శివయ్యతో కోటంక లో వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తూరు లక్ష్మీనారాయణ వధూవరులను ఆశీర్వదించారు.

About Author