లక్ష్మీనారాయణ గెలుపునకు సమిష్టి కృషి
1 min read– బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గద్దెల నాగభూషణం
– మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి
– జిల్లా ఇన్చార్జి తిరుమలయ్య
పల్లెవెలుగు వెబ్ అనంతపురం : బహుజన సమాజ్ పార్టీ శ్రేణులంతా సమిష్టి కృషితో తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కొత్తూరు లక్ష్మీనారాయణ ను గెలిపించుకోవడానికి కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణం పిలుపునిచ్చారు. శుక్రవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో బిఎస్పి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి లక్ష్మీనారాయణ కు చెందిన బ్యాలెట్ నమూనా పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణం మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థి లక్ష్మీనారాయణ పేరు బ్యాలెట్ పేపర్లో 14 నెంబర్ దగ్గర ఉంటుందని, పేరుకు ఎదురుగా ఒకటి అనే నంబర్ రాసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. పార్టీ జిల్లా ఇన్చార్జి తిరుమలయ్య మాట్లాడుతూ యువకుడు, ఉత్సాహవంతుడు, మేధావి, సీనియర్ జర్నలిస్టు, యువ నాయకుడు కొత్తూరు లక్ష్మీనారాయణ ని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. లక్ష్మీనారాయణకు సమాజంలో ఉన్న పేదరికం, నిరుద్యోగం, కార్మికులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మంచి అవగాహన కలిగిన వ్యక్తి అన్నారు. ఆయన గెలుపుతో అందరి వాణి శాసనమండలిలో వినిపిస్తుందని, పట్టభద్రులందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అంకె కుళ్లాయప్ప, తాడిపత్రి నియోజకవర్గం అధ్యక్షుడు నాగ సుబ్బరాయుడు, రాయదుర్గం నియోజకవర్గం అధ్యక్షుడు ఉలిగప్ప, గుంతకల్లు నియోజకవర్గం అధ్యక్షుడు శ్రీనివాసరాజు, అనంతపురం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ హేమ సుందర్ రాజు, కళ్యాణదుర్గం నియోజకవర్గం అధ్యక్షురాలు నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.