PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంస్థ ఆర్థిక పటిష్టత కోసం “ధర్మరక్షానిధి”

1 min read

– విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహకోషాధికారి గూడా సుబ్రహ్మణ్యం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శుక్రవారం ఉ.10:30 నుండి 1:30 వరకు విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన కర్నూలు జిల్లా సమావేశంలో జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ హితచింతక్(సభ్యత్వ నమోదు) కార్యక్రమలో రాష్ట్రంలోనే ప్రప్రథమ స్థానం లో వచ్చిందనీ,ధర్మరక్షానిధి సేకరణలో కూడా ప్రప్రథమ స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ నుండి ముఖ్య వక్తగా విచ్చేసిన విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సహకోషాధికారి గూడా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఏ సంస్థకైనా కార్యకర్తల బలం,ఆర్థిక బలం ముఖ్యం మన విశ్వ హిందూ పరిషత్ కు కూడా కార్యకర్తల సమూహంతో పాటు ఆర్థిక అవసరాలు ఉన్నాయి,పరిషత్ లో పనిచేసే కార్యకర్తలు గ్రామాలు,ఇతర ప్రదేశాలకు ప్రయాణపు ఖర్చులు,ధర్నాలు,సభలు, సమావేశాల నిర్వహణ,తమ పూర్తి సమయాన్ని ఇచ్చి పనిచేసే పూర్తి సమయ కార్యకర్తల వ్యవస్థ,నిర్వహణ,కొరకు ఇలా చాలా వ్యవస్థల నిర్వహణల కోసం ఆర్థికం అవసరం కావున స్వయంసేవకులైన ప్రతి కార్యకర్త తాను స్వంతం ధర్మరక్షానిధి సమర్పించడం తో పాటు,ప్రతికార్యకర్త 20 మంది హిందూబంధువులను కలిసి సంస్థ యొక్క వివరాలు,విజయాలు తెలియజేసి ధర్మరక్షానిధి సేకరించాలనీ పిలుపునిచ్చారు,ప్రతి కమిటీ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని పనిచేయాలని తద్వారా సంస్థకు సం. పాటు ఆర్థిక అవసరాలను పరిపుష్టి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర బజరంగ్ దళ్ కన్వీనర్ ప్రతాప రెడ్డి,సామాజిక సమరసత కన్వీనర్ కే.కృష్టన్న,రాష్ట్ర మాతృశక్తి కన్వీనర్ శ్రీమతి గౌరి,విభాగ్ బజరంగ్ దళ్ కన్వీనర్ నీలి నరసింహ,జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్,జిల్లా కోశాధికారి అయోధ్య శ్రీనివాస రెడ్డి,జిల్లా బజరంగ్ దళ్ కన్వీనర్ రాజేష్,శివశంకర్,నగర అధ్యక్షులు టీ.సీ.మద్దిలేటి,ఉపాధ్యక్షులు కృష్ణపరమాత్మ,కార్యదర్శి ఈపూరి నాగరాజు,నగర బజరంగ్ దళ్ భగీరథ,మాతృశక్తి కన్వీనర్ శ్రీమతి భార్గవి,ప్రఖంఢ కార్యకర్తలు వెంకటేశ్వర్లు,గిరిబాబు,విజయలక్ష్మి,తిమ్మయ్య,సిద్దయ్య,గ్రామాలు,సురేంద్ర వీరశేఖరాచారి,వెంకటరామారావు, కోడుమూరు కార్యదర్శి నటరాజ్,గూడూరు కార్యదర్శి శివరాముడు తదితరులు పాల్గొన్నారు.

About Author