NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాఘవేంద్రను గెలిపించండి

1 min read

– షబానా బిజెపి జాతీయ నాయకురాలు
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: పట్టణంలోని ప్రైవేట్పాఠశాలలో త్వరలో జరగనున్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నగరూరు రాఘవేంద్రకు మద్దతుగా బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు షబానా ఎన్నికల ప్రచారం నిర్వహించారు .ఈ సందర్భంగా షబానా మాట్లాడుతూ ఈనెల 13వ తేదీ జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాఘవేంద్రను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాఘవేంద్ర ఉన్నత విద్యావంతులని ,ప్రజా సమస్యలపై మంచి అవగాహన ఉన్నవాడని ,అలాంటి వ్యక్తిని చట్టసభలకు పంపిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నవారికి అధికారం తలకెక్కిందని, అందుకే ఇష్టారాజ్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పారు .సొంత మీడియాలో తమను తాము ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడిగా ప్రచారం చేసుకుంటూ ప్రజల పరిపాలనను పక్కన పెట్టారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టబద్రులు భావోద్వేగతో కాకుండా వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రానికీ కెంధ్ర ప్రభుత్వం నిధులు ఇస్తూన్నా వాడుకునె పరిస్తితి లేదన్నారు. బిజెపిని కమ్యూనల్ పార్టీగా ప్రచారం చేస్తున్నారని, అదే నిజమైతే ఆఫ్గనిస్తాల్లో హాస్పిటల్ కట్టడం, టర్కీలో బాధితులకు సహాయం చేయడం వంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. ఈ దేశంలో మైనార్టీలకు రాజ్యాంగపరంగా రావాల్సిన అన్ని హక్కులను బిజెపి ఇచ్చిందని గుర్తు చేశారు.

About Author