వలస కూలీల సమస్య పరిష్కారం చేసిన సిఐ సుబ్బరాయుడు
1 min read
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం ఝార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాష్ట్రాలకు సంబంధించిన వలస కూలీలు అవుకు మండలం మెట్టుపల్లె వద్ద కాలువ టన్నేల్ పనులు చేస్తూ జీవనం గడుపుతున్నారు. వారి యాజమాన్యంఫిబ్రవరినెలజీతంఇవ్వకపోవడంతో బనగానపల్లె సీఐ సుబ్బరాయుడు స్థానిక పోలీస్ స్టేషన్ నందు సంప్రదించడం జరిగింది. దీంతో సిఐ సుబ్బరాయుడు కూలీల తరఫున యాజమాన్యంతో మాట్లాడి ఈనెల 20వ తేదీ లోపల జీతం కూలీలకు చేరుతుందని చెప్పడంతో సమస్య ముగిసింది. దీంతో కూలీలు సిఐ సుబ్బరాయుడు అవుకు ఎస్సై జగదీశ్వర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.