పట్టుదలతో చదవితే ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం సులభం
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: స్వేచ్చాయుత వాతావరణంలో ప్రణాళిక బద్దంగా చదివితే విజయం మన సొంతం అవుతుందని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి యస్.నరసింహులు విద్యార్థులకు సూచించారు.సోమవారం గోనెగండ్లలోని ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ నందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు త్వరలో జరగనున్న పదవ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని అవగాహన సదస్సును ప్రిన్సిపాల్ షాహిన్ పర్వీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ సదస్సులో క్లాస్ మాస్టర్స్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు రామన్ ,జిల్లా కౌన్సిలర్ జిక్రియ లు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలకు ఏలా ప్రిపేర్ కావాలి?ఏలా చదివితే పదవ తరగతిలో మంచి మార్కులు సాధించగలరు?ఏయే అంశాల పైన అవగాహనా కల్గి ఉండాలి?అనే అంశాలపైన విద్యార్థులకు చక్కగా అవగాహన కల్గించి త్వరలో జరగనున్న పదవతరగతి పరీక్షలలో విద్యార్థులు రోజు వారి ప్రణాళిక ప్రకారం చదవి మంచి మార్కులతో ఉత్తిర్ణత సాధించి మీ తల్లిదండ్రులకు,పాఠశాలకు, మండలానికి మంచి పేరు తీసుకరావాలని కొనియాడారు.తదనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ షాహినా పర్వీన్ గారు మాట్లాడుతూ సమాజంలోని పిల్లలు తమ పిల్లలుగా భావించి మనకున్న పరిజ్ఞానాన్ని పదిమంది విద్యార్థులకు అందించాలనే తపనతో రెండు గంటల పాటు నిర్వీరామంగా మా పాఠశాల విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ ఇచ్చిన ఉపాధ్యాయులు రామన్,జిక్రియ లను అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రజాక్, చాంద్ భాష,రాజశేఖర్,సునీత మరియు ఎస్ ఎఫ్ ఐ నాయకులు పాల్గొన్నారు.