PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీవనోపాధి కోల్పోయo.. ఆదుకోవాలంటు నిరసన

1 min read

– ఏలూరు ఆశ్రం హాస్పటల్ రోడ్డు వెంబడి కూల్డ్రింక్ షాపుల పునరుద్ధరణకై జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా, దెందులూరు మండలం, ఏలూరు ఆశ్రం హాస్పటల్ వద్ద షాపులు గత 20సంవత్సరాలు నుండి అక్కడనే 25 మంది షాపులు పెట్టుకొని జీవనోపాధిని సాగిస్తున్నాము మా షావులకు సంబంధించిన పన్నులు మరియు కరెంటు బిల్లులు యదవిదగా మేమ చెల్లించుచున్నాము. ది. 28-01-2023 సం తేదిన సాయంత్రం 4గం||లకు. ఏలూరు. .యమ్.ఆర్.ఒ పాలగూడెం పంచాయితీ వారు మున్సిపల్ వారు వచ్చి ఆశ్రం హాస్పటల్ వద్ద ఉన్న 25 మంది కుటుంబాల షాపులను తొలగించినారు. ఇలా ఎందుకు తొగించినారు అని మేము అడుగగా కలెక్టర్ అదేశాలు మేరకు తొలగిండము జరిగింది. అని మాకు చెప్పినారు. మా జీనవాపాధి మా షాపు లే జీవనోపాధి మాకు ఏ ఆధారము లేదు. గత 40 రోజు నుండి మేము అధారము లేకుండా రోడ్డుల మీద జీవనం సాగిస్తునాము మేము అధికారులు చుట్ట తిరుగాగ మాకు షావులు పెట్టుకొమని చెప్పినారు. చెప్పారు అని మేము మరల షావులు పెట్టుకున్నాము. 04-03-2023 సం: తేదిన ఉదయం 8 గంటలకు వచ్చి జె.సి.పితో వచ్చి మా షాపు పడగొట్టించారు. మాకు జీవనోపాధి ఆ షాపుమీదనే మా కుటుంబ పోషణ కోల్పోయింది. 25 కుటుంబాలు 25 షాపులు పెట్టుకొనుటకు మాకు అనుమతి ఇప్పించవలసినదిగా కోరుచున్నాము. మేము ఎవ్వరికి అడ్డులేకుండా రోడ్డు ఇబ్బంది కలుగుండా రోడ్డు వెనుకగా పెట్టుకొనుటకు మాకు అనుమతి ఇప్పించవలసిందిగా. ఈ షాపులను నమ్ముకొని డైలీ చీటిలు, బ్యాంకు లోన్లు, మరియు నెల వడ్డీ లు కట్టుకోవాలి మాకు ఇంటి చిన్నపిల్లలు ముసలితనం తల్లిదండ్రులు ఉన్నారు.కావున ఉన్నతాధికారులు మా యందు దయవుంచి మాకు మరల షాపులు పెట్టుకొనుటకు అనుమతి. ఇప్పించవలసినదిగా కోరుచున్నాము. ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఎం లక్ష్మి ,గోవిందు, ప్రసాద్, దుర్గారావు, పైడినాయుడు, లక్ష్మీ ,లక్ష్మీ దుర్గ, దేవి, మోహన్ ,అప్పలనాయుడు, రాజు ,విజయ్ ,నాని ,వెంకటేష్ సంధ్య, దుర్గ ,మురళి ,డేవిడ్ పిచ్చయ్య ,మంగమ్మ, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

About Author