పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ
1 min read– మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో..
– మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవింద్రారెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నందికొట్కూరు లో 14 సచివాలయ ఉద్యోగులను కోరుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ దూసుకుపోతోంది. ముమ్మరంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం..రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆదేశాల మేరకు నందికొట్కూరు మున్సిపాలిటీ లోని 14 సచివాలయాలు,ప్రవేట్ విద్యా సంస్థలు, కళాశాలలో వైసీపీ నాయకులు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల మద్దతుగా ఎన్నికల ప్రచారం మంగళవారం ముమ్మరం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రా రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలుపొంది సేవా కార్యక్రమాలకు వారి సేవలు అందించేలా చూడాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బార్ అసోసియేషన్ మద్దతు ద్దతు కోరుతూ.రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం నందికొట్కూరు సీనియర్ మరియు జూనియర్ సివిల్ జడ్జి ల కోర్టు నందు బార్ అసోసియేషన్ సభ్యులను మద్దతు కోరుతూ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి వెన్నపూస రవింద్రా రెడ్డి కి మద్దతుగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బార్ అసోసియేషన్ సీనియర్ మరియు జూనియర్ లాయర్స్ ని కోరారు.అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవింద్రా రెడ్డి బార్ అసోసియేషన్ లాయర్స్ తో వర్చువల్ పద్దతిలో మాట్లాడి మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు చిన్న రాజు, మందాడి వాణి, యం.సమీరా భాను, ఉస్మాన్ బేగ్, అబ్దుల్ రవూఫ్, లాలు ప్రసాద్, పి.శాంతకుమారి, కృష్ణవేణమ్మ, నాయబ్, వైసీపీ నాయకులు రజనీ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, సతీష్ రెడ్డి , పి.రమేష్, డి.రమేష్, రవీంద్రా రెడ్డి, బ్రహ్మయ్య ఆచారి, జగదీశ్వర ఆచారి,చింత విజయ భాస్కర్, చింత శ్రీనివాసులు,మద్దిలేటి, మైనార్టీ నాయకులు అబూ బక్కర్, జబ్బార్ , కృష్ణ, నంది కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్, నందికొట్కూరు మండల ఖాజీ జలాల్, చింత నాగేంద్ర తదీతరులు పాల్గొన్నారు.