పునరావాసం కోసం ప్రభుత్వం కృషి చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ : అక్రమ రవాణా బాధితులు కోసం సాధికారిక కోసం ప్రభుత్వం కృషి చేయాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విముక్తి హెల్ప్ సంస్థలు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది .మహిళలు బాలికల అక్రమ రవాణా లేదా వాణిజ్యపరమైన లైంగిక దోపిడీపై గణనీయమైన ప్రభావం చూపింది అంటే భారతదేశంలో అత్యధిక సంఖ్యలో సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నేడు గుర్తింపు పొందింది సెక్స్ వర్కర్ల అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సమస్యలు పరిష్కరించాలని, వారిని ప్రోత్సహించాలని వారి విశ్వాసాన్ని గెలుచుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సెక్స్ వర్కర్లు పొదుపు సంఘాలు మరియు బ్యాంకు మధ్య సంబంధాలు సులభతనం చేయడంతో సహాయపడే వ్యవస్థ ఏర్పాటు చేసి సెక్స్ వర్కర్లు జీవనోపాధి వైవిధ్యాన్ని పెంచడానికి ఒక కృషి చేయాలని ప్రభుత్వానికి వారు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు పేరిట అట్టడుగు బలహీన వర్గాల ప్రజలు మహిళలకు ,వివిధ సంక్షేమ పథకాలు ద్వారా వారి ఆర్థిక అభివృద్ధి, సాధికారిక కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ,కానీ మన రాష్ట్రంలో పునరావాసం నష్టపరిహారం అందక అక్రమ రవాణాకు గురైన 1.33 లక్షల మంది మహిళలు బాలికలు నేటికీ వ్యభిచార కోపంలోనే మగ్గుతున్నామని మగ్గుతున్న వీరి పునరావాసం సంక్షేమం కోసం 2003లో రూపొందించిన జీ.వో నెంబర్ 1పునర్ధరించి సక్రమంగా పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నామని అన్నారు. ఈ మీడియా సమావేశంలోని ప్రెసిడెంట్ అపూర్వ ,వైస్ ప్రెసిడెంట్ రజిని, సెక్రెటరీ పుష్ప జాయింట్ సెక్రెటరీ మౌనిక మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.