సంక్షేమ వసతి గృహాలకు సన్న బియ్యం అందించాలి
1 min read– పాదయాత్రలో ఇచ్చిన హామీలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు ప్రభుత్వ బీసీ బాలుర సంక్షేమ వసతి గృహాన్ని పి డి ఎస్ యు విద్యార్థి సంఘం నాయకుల బృందం సందర్శించారు . రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా సంక్షేమ వసతి గృహాలకు సన్న బియ్యం సరఫరా చేస్తామని చెప్పి మాట తప్పారని విద్యార్థులకు మోసం చేశారని బుధవారం పి డి ఎస్ యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పి.మర్రిస్వామి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు వసతి గృహాలలో భోజనం సరిగా ఉండడం లేదని విద్యార్థులు తినడానికి ఇష్టపడతలేరని సంక్షేమ వసతి గృహాలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం సరఫరా చేస్తామని ఆర్భాటంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల గురించి ఆలోచించిన వాళ్ళు కనుమరుగైపోయారా అని ప్రశ్నించారు. సంక్షేమ హాస్టల్ లో దొడ్డు బియ్యం తిని విద్యార్థులు ఒక్కొక్కసారి ఉడికిఉడకని అన్నం తిని కడుపునొప్పులతో బాధపడుతున్నారన్నారు.విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యం అందించే వరకు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని తెలియజేసి విద్యార్థులను సిద్ధపరుస్తామని ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. పిడి ఎస్ యు ఆధ్వర్యంలో సన్న బియ్యం సరఫరా చేసేంత వరకు ఉద్యమాలకు సిద్ధపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు రాము, ఈశ్వర్, బిట్టు, తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.