స్థానిక జిల్లా పరిషత్ క్వాలిటీ కంట్రోల్ ఆవరణలో డెమో
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు : పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ క్వాలిటీ కంట్రోల్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ క్వాలిటీ కంట్రోల్ ఆవరణలో మంగళవారం డెమో నిర్వహించారు, పెదపాడు, పెదవేగి, ఏలూరు, దెందులూరు సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ లకి. సివిల్ ఇంజనీరింగ్ కి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు చేయుట మరియు క్వాలిటీ కంట్రోల్ పరీక్షల విధానాలు, పద్ధతులు గురించి ఇసుక, సిమెంట్, చిప్స్ మిశ్రమాలను కలిపి విద్యార్థులకు వివరించారు. ఈ విధి విధానాలను విజయవాడ క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( పంచాయతీరాజ్ ) ఎల్ ఏడుకొండలు ప్రాక్టికల్ గా పరీక్షలు చేసి చూపించారు. ఈ ప్రాక్టికల్ పరీక్షల కార్యక్రమానికి నాలుగు మండలాలకు సంబంధించి సుమారు 100 మంది సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. సందర్భాను సారం అప్పుడప్పుడు ఇటువంటి ప్రాక్టికల్ పరీక్షలు చేసి చూపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు క్వాలిటీ కంట్రోల్ డి.ఇ.ఇ కె.జి.వి ప్రసాద్, డి వై లీలా మోహన్ మరియు క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.