ఉత్తమ అంగన్వాడీ టీచర్ అవార్డు అందుకున్న చంద్రకళ
1 min read– అభినందించిన పలువురు అధికారులు.. ప్రజా ప్రతినిధులు.. ప్రజా సంఘాల నేతలు.. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు..
పల్లెవెలుగు వెబ్ చాగలమర్రి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం చాగలమర్రి కి చెందిన 17 అంగన్వాడి కేంద్రం అంగన్వాడి టీచర్ చంద్రకళ విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు, నంద్యాల జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి, జిల్లా జడ్జి అర్చన, ఆర్జెడి పద్మజా, జిల్లా ప్రాజెక్టు అధికారిని చేతుల మీదుగా ఉత్తమ అంగన్వాడి టీచర్ అవార్డును ప్రశంసపతాన్ని అందుకుంది. ఆళ్లగడ్డ ప్రాజెక్టు పరిధిలో బెస్ట్ అంగన్వాడి సూపర్వైజర్ గా దస్తగిరమ్మ, బెస్ట్ అంగన్వాడీ టీచర్ గా చంద్రకళ, అంగన్వాడి ఆయాగా మరొకరికి దక్కడం హర్షణీయమని ఆళ్లగడ్డ ప్రాజెక్టు సి డి పి ఓ తేజశ్వణి అన్నారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పటిష్టంగా సమయపాలన పాటించి ఎలక్ట్రానిక్ సిస్టం ద్వారా గర్భవతులు బాలింతలు చిన్నపిల్లల వివరాలను సమగ్రంగా ఎప్పటికప్పుడు నమోదు చేయడం. ఉన్నతాధికారులు సూచించిన మేరకు సమయస్ఫూర్తితో మాతా శిశు సంరక్షణకు మెలుకువలు సూచనలిస్తూ, వైద్య ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహిస్తూ, వైద్య ఆరోగ్యశాఖ ఆరోగ్య కార్యకర్తలు, సంబంధిత డాక్టర్లచే పలు సూచనలు ఇప్పించడం ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ చైతన్యవంతులను చేయడం పట్ల గుర్తించిన అధికారులు ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. మండలంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ ఇంట్లో బుద్ధిమాంద్యముగల పిల్లవాడికి సేవలందిస్తూ, ఒకవైపు సమాజ శ్రేయస్సు కోరి బాల్య వివాహాలు, మహిళా సమస్యలను పోలీసులతో, మహిళ పోలీసులతో పోలీసు ఉన్నతాధికారులతో పరిష్కరిస్తూ, విధి నిర్వహణ పట్ల అంకితభావంతో పనిచేస్తున్న చంద్రకళకు బెస్ట్ అంగన్వాడి టీచర్ గా జిల్లా ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నందుకు చాగలమర్రి మండల అధికారులు, వివిధ సచివాలయాల వివిధ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, అంగన్వాడి టీచర్లు, పలువురు అభినందించారు.