ఉద్యోగులను మోసం చేసిన వైసీపీకి ఓటు అడిగే అర్హత లేదు
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఉద్యోగులు, ఉపాధ్యాయులను మోసం చేసిన వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత లేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఫకీర్ సాహెబ్, మాజీ ఎస్ఎఫ్ఐ నాయకుడు పుల్లన్న ,వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు వేణుగోపాల్ అన్నారు, బుధవారం మండలంలోని బ్రాహ్మణ కొట్కూరు, వడ్డెమాను, కోనేటమ్మ పల్లె గ్రామాలలోని పాఠశాల లు, ,సచివాలయాలు ,ప్రైవేట్ స్కూళ్లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న పోతుల నాగరాజు ను వరస సంఖ్య 27 వద్ద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఉద్యోగ ,ఉపాధ్యాయ పట్టభద్రులు గెలిపించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయ ,కార్మికుల సమస్యలు శాసనమండలిలో చర్చకు రావాలంటే ఖచ్చితంగా పిడిఎఫ్ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. శాసనమండలిలో ప్రశ్నించే మేధావుల ఫోరం నుంచి పోతుల నాగరాజు , కత్తి నరసింహారెడ్డి లు పోటీ చేస్తున్నారన్నారు. పోతుల నాగరాజు వరుస సంఖ్య 27 వద్ద , ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి వరుస సంఖ్య 3 వద్ద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి శాసనమండలికి పంపించాలని వారు కోరారు.