మహిళా రిజర్వేషన్ బిల్లు కై ప్రజా ఉద్యమం
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఇండియన్ ప్రజా కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం లోజరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహిళా సంఘాలు వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఐపిసి రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు నూతక్కి కృష్ణ రేఖ మాట్లాడుతూ పార్లమెంటులో ప్రధాని మోడీకి పూర్తి మెజారిటీ ఉన్నందున చిత్తశుద్ధితో ఇకనైనా మహిళా రిజర్వేషన్ల బిల్లు గణేశా ప్రవేశ పెట్టి చట్టం చేయాలని కోరారు. మహిళలు లైంగిక వేధింపులు అత్యాచారాలు హత్యలు ఎదుర్కొంటున్నందున సంపూర్ణ స్వేచ్ఛ సమానత్వాన్ని అందించాలని కోరారు. ఈనెల 10న ఢిల్లీలో పార్లమెంటు ముందు మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం బిఆర్ఎస్ మహిళా నేత కల్వకుంట్ల కవిత గారు చేపట్టిన మహా ధర్నాకు వివిధ రాజకీయ పార్టీల మహిళా సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ సంఘీభావం తెలుపుతూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించామని తెలిపారు. జిల్లా అధ్యక్షురాలు కట్టె పోగు లిల్లీ గ్రేస్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో వివక్షతను అసమానతులను ఎదుర్కొంటూ తక్కువ వేతనాలతో జీవనం సాగిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని సమాన పనికి సమాన వేతనం అందించాలని చట్టసభలలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం అందించాలని కోరారు మహిళలకు చట్టాలు తెచ్చిన పెద్ద ఎత్తున ఉల్లంఘనకు గురయ్యాయని వాటిపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు లేవని అన్నారు రెండో తరగతి వారుగా చూడటం పురుష ఆధిక్యత కింద నలిగిపోతున్నారని అన్నారు .మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు మహిళా సంఘాల మద్దతు కోరుతున్నామని తెలిపారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జుజ్జువరపు ప్రశాంతి మాట్లాడుతూ అనేక చట్టాలు ఎలాంటి చర్చ లేకుండానే పాస్ చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయడం పెద్ద విషయమే కాదని కానీ మహిళల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు.బిసి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోతి మాట్లాడుతూ దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేనందున చట్టాలు చేసే చోట మహిళలకు భాగస్వామ్యం కల్పించాలని కోరారు బీసీ జనాభా లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు జనాభా ప్రాతిపదికన తగిన ప్రాతినిధ్యం కొరవడిందని అన్నారు ఉద్యోగాల్లో ప్రమోషన్లు చట్టం ద్వారానే రావాలని కోరారు అవసరమైన చోట సబ్ కోటాని అమలు చేయాలని కోరారు. మాజీ మేయర్ తాడి శకుంతల మాట్లాడుతూ 2010 రాజ్యసభలో 33% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినా 15వ లోకసభ ముగియడంతో బిల్లు కూడా రద్దయిందన్నారు.50% మహిళలకు రిజర్వేషన్లు పెంచి అమలు చేయాలని కోరారు.మహిళలను అంగడి వస్తువుగా మార్చి వారిపట్ల వివక్షత చూపుతున్నారని అన్ని రంగాల్లో మహిళలు పురుషుల కంటే ముందంజలో ఉన్నారని అన్నారు. మహిళలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా పైకి తీసుకురావాలని కోరారు మహిళల పట్ల అణిచివేత తగదు అన్నారు. ఐపీసీ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి మహేష్ మాట్లాడుతూ 26 జిల్లాల్లో సదస్సులు ర్యాలీలు సభలు నిర్వహించి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రభుత్వ అధికారులకు ఎంపీలకు వినతి పత్రాలను మహిళా సంఘాలతో అందిస్తామని అన్నారు. మహిళా బిల్లు చట్టం తెచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఉద్యమం చేపడతామని అన్నారు. అలానే దేశంలో ఉన్న మొత్తం రిజర్వేషన్లన్నీ సమీక్షించాలని ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈ బీసీలకు కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్ ముందుందని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వర్గీకరణ మీద స్పష్టమైన వైఖరి తెలియజేసిందని ఎస్సీ వర్గీకరణ వెంటనే జరిపించాలని అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానమైన డిమాండ్లుగా ప్రధాని మోడీ ముందు ఉన్నాయని పరిష్కారం చూపాలని వక్తలు కోరారు. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చింతా రాజశేఖర్ మాట్లాడుతూ ఏపీకి రాష్ట్ర విభజన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్ణయాలు అన్నీ కూడా తొక్కి పట్టి ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల మనోభావాలను మోడీ దెబ్బతీశారని అన్నారు ప్రత్యేక హోదా సాధన విషయంలో 25 పార్లమెంటు సీట్లు అడిగి 23 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు జి ఫణి రాజ్, ఐక్య కాపునాడు రాష్ట్ర నాయకులు బేతు రామ్మోహన్ రావు, రిపబ్లిక్ అండ్ పార్టీ రాష్ట్ర నాయకులు రబ్బా వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ నాయకులు దాన గౌడ్, ఐపిసి ఉత్తరాంధ్ర జిల్లాల అధికార ప్రతినిధి గోరింత అప్పలరాజు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కె ఎలీషా గాంధీ, ఐ పి టి యు సి రాష్ట్ర నాయకులు పి శ్రీనివాస్ గౌడ్, కె వెంకటరత్నం, కె బుజ్జి, కె .మారతమ్మ, కె .మల్లేశ్వరి, ఎ. వెంకాయమ్మ తదితరులు పాల్గొన్నారు.