రాయలసీమ అభివృద్ధి..బీజేపీతోనే సాధ్యం
1 min readపట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాఘవేంద్ర నగరూరు
పల్లెవెలుగు వెబ్: రాయలసీమ వెనుకబాటు తనాన్ని మండలిలో వినిపించి..సీమ అభివృద్ధికి కృషి చేసేందుకు పట్టభద్రులందరూ సహకరించాలని పిలుపునిచ్చారు బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాఘవేంద్ర నగరూరు. బీకాం, ఎంబీఏ, ఎల్ఎల్బీ న్యాయశాస్ర్త విద్య అభ్యసించిన తాను.. న్యాయవాదిగా… వ్యాపారవేత్తగా విజయపథంలో నడిచానని పేర్కొన్నారు. శుక్రవారం రాఘవేంద్ర నగరూరు విలేకరులతో మాట్లాడుతూ తన తండ్రి నగరూరు సుబ్రహ్మణ్యం ట్రస్టు ద్వారా పేద విద్యార్థులకు ఆట వస్తువులు, పుస్తకాలు, బ్యాగ్లు అందించడమేకాక పలు స్వచ్ఛంద సేవా సంస్థలలో పాల్గొంటూ..తనవంతు సహాయం చేశానని పేర్కొన్నారు. అంతేకాక నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించానన్నారు.
ప్రధాని సిద్ధాంతాలకు.. ఆకర్షితుడై…:
దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని, ఆయన సిద్ధాంతాలు, ఆశయాలకు ఆకర్షితుడై బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగానని వెల్లడించారు. పట్టభద్రులందరూ ఆలోచించి తనకు ఓటు వేసి.. వేయించి గెలిపించాలని ఈ సందర్భంగా రాఘవేంద్ర నగరూరు కోరారు.
నిరుద్యోగ యువత కోసం.. పోరాటం..:
రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా రాయలసీమ అభివృద్ధికి నోచుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాఘవేంద్ర నగరూరు. గుండ్రేవుల, వేదావతి తదితర ప్రాజెక్టులు పూర్తి చేయకుండా వైపీసీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలో పరిశ్రమలు లేక నిరుద్యోగుల శాతం పెరుగుతోందని, తనను గెలిపిస్తే నిరుద్యోగుల కోసం మండలిలో పోరాటం చేస్తానన్నారు.
తనను గెలిపిస్తే…:
ప్రభుత్వ కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలను రెగ్యులరైజేషన్ చేసేందుకు కృషి చేస్తా. కర్నూలులో హై కోర్టు ఏర్పాటుకు సాధన చేస్తా. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా. ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధికి విశేష కృషి చేస్తానని, ఇందుకు పట్టభద్రులందరూ తనకు ఓటు వేసి..వేయించి గెలిపించాలని ఈ సందర్భంగా రాఘవేంద్ర నగరూరు కోరారు.