అత్యవసరమైతేనే.. బయటకు రండి
1 min read– ఆదోని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి
పల్లెవెలుగు వెబ్, గోనెగండ్ల: కరోన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కర్ఫ్యూ సమయంలో అవసరమైతే తప్పా.. బయటకు రావద్దొని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి సూచించారు. శనివారం గోనెగండ్ల కర్ఫ్యూను ఆయన పరిశీలించారు. ఈ నెలాఖరివరకు లాక్డౌన్ కర్ఫ్యూను పొడిగించిన విషయం అందరికీ తెలిసిందేనన్న ఆర్డీఓ… మధ్యాహ్నం 12 గంటల తరువాత అనవసరంగా బయటకు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, శానిటైజర్ వాడాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో వేణుగోపాల్, ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి, ఆర్ఐ సునీల్ కుమార్, వీఆర్ఓలు పోలీసులు, తలారీలు తదితరులు పాల్గొన్నారు.