టిజి భరత్ చొరవతో 9 ఏళ్ల చిన్నారి గుండె ఆపరేషన్ విజయవంతం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ చొరవతో 9 ఏళ్ల చిన్నారి గుండె ఆపరేషన్ విజయవంతం అయ్యింది. కర్నూలు నగరంలోని బాపూజీ నగర్ కు చెందిన నాగమద్దయ్య, గీతల కుమార్తె రూపకు గుండెలో రంధ్రం ఏర్పడింది. దీంతో కర్నూల్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ వైద్యులు ఇక్కడ సర్జరీ చేయడం కష్టమని, హైదరాబాద్ వెళ్లాలని రూ. 4 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పాప కుటుంబ సబ్యులు టిజి భరత్ ను కలిసి సమస్య తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన టిజి భరత్ కర్నూల్లోని గౌరి గోపాల్ హాస్పిటల్ లో చేర్పించి ఫిబ్రవరి 11 వ తేదీన విజయవంతంగా ఆపరేషన్ చేయించారు. ఈ సందర్బంగా శనివారం ఆపరేషన్ తర్వాత కోలుకున్న పాపతో కలిసి కుటుంబ సబ్యులు మౌర్య ఇన్ లో టిజి భరత్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టిజి భరత్ మాట్లాడుతూ తమ హాస్పిటల్ లో విజయవంతమైన వైద్యులు డాక్టర్ లక్ష్మణ స్వామి ఉన్నారని.. చిన్నారి సమస్య తెలిసిన వెంటనే ఆయన ఆపరేషన్ చేసేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. విజయవంతంగా ఆపరేషన్ పూర్తి అయ్యిందన్నారు. కర్నూలు ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ముందుండి చేస్తానని భరత్ అన్నారు. చిన్నారి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయ్యినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నేతలు తారనాథ్, మధు, శ్రీనివాసులు, మద్దయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.