PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోతుల నాగరాజు గెలుపుకై గోనేగండ్లలో పోటెత్తిన ప్రచారం

1 min read

ఊరి బాగుకై ఉద్యమ అభ్యర్థులను గెలిపించుకుందాం
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: తరాలు మారుతున్న పాలకుల విధానాల కారణంగా ప్రజలు కష్టాల కడలిలోనే మగ్గుతున్నారని, ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని, అభివృద్ధిని కాంక్షించి పనిచేసే ఉద్యమ అభ్యర్థులను మన ఊరి బాగు కోసం గెలిపిద్దామని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన గోనెగండ్లలో శనివారం శాసనమండలికి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా 280 ప్రజా సంఘాలు బలపరిచి, పిడిఎఫ్ తరుపున పోటీ చేస్తున్న డాక్టర్ పోతుల నాగరాజును గెలిపించాలని కోరుతూ గోనెగండ్లతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. గోనెగండ్లలోగంజహళ్లి రోడ్డు వద్ద ప్రారంభమైన ప్రచారం, మెయిన్ రోడ్డు, కడపల వీధి, చాంద్ టాకీస్, గణపతి కట్ట, పంచాయతీ కార్యాలయం, పెద్ద కట్ట, కురువ వీధి, బీరప్ప గేరి, రజక వీధి, ఎస్సీ పేట మీదుగా స్టేట్ బ్యాంక్ నుండి బస్టాండ్ వరకు ప్రతి ఓటర్ ను కలిసి మూడవ దప ప్రచారం నిర్వహించారు.మెగా ప్రచార క్యాంపియన్ లో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యం డి ఆనంద్ బాబు, యుటిఎఫ్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా నాయకులు ఎస్. నరసింహులు, వీరన్న, జనసేన నాయకులు గానుగ భాష, ఖాజా, కెవిపిఎస్, ఏపీడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షులు బి కరుణాకర్, దండు ఖాజా, యుటిఎఫ్ మండల అధ్యక్షులు రామన్, నాయకులు జిక్రియ పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజాతంత్ర హక్కుల రక్షణ కోసం, ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రజా ఉద్యమాలతో కలిసి, నికరంగా పనిచేస్తున్న డాక్టర్ పోతుల నాగరాజు లాంటి వ్యక్తులు శాసనమండలికి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక, కర్షక, సామాజిక, వృత్తి దారుల సంఘాల తో పాటు, డాక్టర్లు, లాయర్లు, రచయితలు, మేధావులు అంతా ఐక్యమై ముక్తకంఠంతో ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. గెలిచే అవకాశం ఉన్న పోతుల నాగరాజుకు ఇప్పటికే కాంగ్రెస్, జనసేన, వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతును తెలియజేస్తే, టిడిపి పార్టీ కూడా రెండవ ప్రయారిటీ ఓటును వేయమని పిలుపునిచ్చిందన్నారు. పోతుల నాగరాజు గెలుపు ప్రతి గ్రాడ్యుయేట్ గెలుపుగా భావించి సీరియల్ నెంబర్ 27 ముందు మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా పోలింగ్ లో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. మెగా ప్రచార క్యాంపియన్ లో యుటిఎఫ్ నాయకులు రామకృష్ణ, జి.నరసింహులు, ఎస్ఎఫ్ఐ నాయకులు మురళి, నవీన్, చిరంజీవి, చరణ్ పాల్గొన్నారు.

About Author