చెన్నూరులో భారీ వర్షం..
1 min read– వీధులు జలమయం..
– వర్షం నీరు తరలించేందుకు అధికారుల చర్యలు
పల్లెవెలుగు వెబ్, చెన్నూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా చెన్నూరు మండలం లో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం 44 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు రెవెన్యూ అధికారులు తెలియజేశారు, భారీ వర్షాల కారణంగా చెన్నూర్ లో భవాని నగర్. కొత్త గాంధీనగర్. అరుంధతి హరిజనవాడ. లక్ష్మీ నగర్. సరస్వతి కాలనీ. బెస్త కాలనీ గణేష్ కాలనీ తదితర ప్రాంతాల్లోని వీధుల్లో వర్షపునీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో నీరు నిలిచిపోతే.. అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్లు ఎత్తుగా నిర్మించడం, డ్రెయినేజీ ఏర్పాటు చేయడం తదితర సౌకర్యాలు కల్పించాలని చెన్నూరు మండల ప్రజలు కోరారు.
ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా..
మోస్తారు వర్షం కారణంగా చెన్నూరులో పలు వీధులు జలమయమయ్యాయి. లక్ష్మినగర్ ప్రజలు అవస్థలు పడుతుండటంతో వైఎస్సార్సీపీ జిల్లా పంచాయతీ రాజ్ అధ్యక్షులు చీర్ల సురేష్ యాదవ్ ఆయా ప్రాంతాలను పరిశీలించారు. రోడ్లు చిన్నవి కావడం… డ్రెయినేజీ లేకపోవడంతో నీరు ఇళ్ల మధ్య నిలిచిపోయిందని, ఈ విషయంపై ఎమ్మెల్యే పపి. రవీంద్రనాథ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా సురేష్ యాదవ్ స్పష్టం చేశారు.