ఇండ్లు కట్టిస్తున్న వారికి ఎప్పటికప్పుడు బిల్లులు
1 min read– ఇండ్లు నిర్మించుటకు లబ్దారులు ముందుకు రావాలి: ఇన్చార్జి హౌసింగ్ ఏఈ
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు:ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇవ్వాలని ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకువచ్చిన నవరత్నాలు- పిల్లలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఇంతవరకు జగనన్న కాలనీలలో ఇల్లు నిర్మించుకున్న ప్రతి ఒక్కరికి బిల్లులు పెండింగ్ లేకుండా అందరికీ ప్రభుత్వం అందజేసిందని హౌసింగ్ ఇంచార్జి ఏఈ జె.రమేష్ అన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా పెండింగ్ ఉన్న బిల్లులు కూడా శుక్రవారం రోజు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడ్డాయని ఇంటి నిర్మాణం యొక్క బిల్లులు బేస్మెంట్ దశ,గోడల దశ,స్లాబు దశ పూర్తి ఇల్లు ఇలా నాలుగు దశల్లో చెల్లింపబడతాయి.నిర్మాణ దశ పూర్తి అయిన వెంటనే అదే రోజే సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారి లాగిన్లో బిల్లులు ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని తద్వారా ప్రభుత్వం కూడా చాలా తక్కువ రోజులలోనే బిల్లు చెల్లింపులు చేయడం జరుగుతుందని కావున మండలంలోని గృహ లబ్ధిదారులు ముందుకు వచ్చి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఆయన కోరారు.ఉగాది లోపు ఇండ్లన్నీ పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందని అన్నారు.