ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలి
1 min read– సోమవారం ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్
– సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఆదివారం కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో కర్నూలు డివిజన్ కు సంబంధించిన ఎన్నికల పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను కలెక్టర్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, నగరపాలక సంస్థ మునిసిపల్ కమిషనర్ భార్గవ తేజ, డిఆర్ఓ నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని, సోమవారం ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.. తాము వేసిన ఓటు చెల్లుబాటు అయ్యేలా ఓటర్లు ఓటు వేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నిక జరగనున్నదని కలెక్టర్ తెలిపారు. ఓటింగ్ విధానం సార్వత్రిక ఎన్నికలకు భిన్నంగా ఉంటుందని, బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్ధుల పేరుకు ఎదురుగా ఉన్న బాక్సులో, ప్రాధాన్యత నంబర్లను వేయాల్సి ఉంటుందని చెప్పారు. బ్యాలట్ పేపర్ పై ఎటువంటి గుర్తులూ ఉండవని, అభ్యర్ధుల పేర్లు మాత్రమే ఉంటాయని తెలిపారు. అభ్యర్థుల పేరుకు ఎదురుగా అంకెల తోనే ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో అభ్యర్ధులందరికీ ఓటు వేయవచ్చునని సూచించారు.ఎన్నికల సిబ్బంది పోలింగ్ ప్రక్రియ లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు… ఎన్నికల విధులకు సిబ్బంది గైర్హాజర్ అయితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బ్యాలెట్ పేపర్ మడత వేయడం, బ్యాలెట్ బాక్సులు సీలింగ్ తదితర అంశాల్లో ఎన్నికల నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ హరి ప్రసాద్, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, డిపిఓ నాగరాజు నాయుడు, సిపిఒ అప్పలకొండ తదితర జిల్లా అధికారులు, కర్నూలు డివిజన్ జోనల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, పిఓలు, ఏపీవోలు, ఓపిఓలు, మైక్రో అబ్జర్వర్ లు పాల్గొన్నారు.