PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్కావెంజర్స్,స్వీపర్స్ సమస్యలు పరిష్కరించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఎంతోకాలంగా అపరిస్కృతంగా ఉన్న స్కావేంజర్స్ మరియు స్వీపెర్స్ సమస్యలు పరిష్క రించాలని ఏ ఐ టి యు సి జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు.ఆదివారం స్థానిక చదుల రామయ్య భవన్ లో ఏపీ ప్రభుత్వ శ్వీపర స్వీపర్స్,అయాల తాలూకా సమితి సమావేశం జరగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ స్కూల్ స్విపర్స్ సమస్యల పర్స్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిo దన్నారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ తాలూకా అధ్యక్ష కార్యదర్శులు జి నెట్ కంటయ్య ఎం రంగన్నలుమాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ బాత్రూంలు శుభ్రంగా ఉంచాలని, పిల్లలకి అంటువ్యాధులు వ్యాపించకుండా శుభ్రం చేయుటకు పరిసరాలు శుభ్రంగా ఉంచుటకు స్కావెంజర్స్ గా పలువురు గ్రామీణ మహిళలను ప్రభుత్వం నియమించిందని అన్నారు. 2018 నుండి ఇప్పటివరకు చాలామందికి వేతనం అందలేదని తెలిపారు. స్కావెంజర్స్ గా ఉన్నవారు కార్మికులుగా గుర్తించవలసి వస్తుందని, వీరికి కార్మిక చట్టాలు వర్తిస్తాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీరినిఆయాలపేరుతోవెట్టిచా కిరీచేయిస్తుందన్నారు .ప్రభుత్వ పాఠశాలలో బాత్ రూముులలో మలమూత్రలను శుభ్రపరిచే కార్మికులను ఆయాలు కాకుండా స్వీపర్సు( స్కావెంజర్స్) గా గుర్తించి కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పిల్లల ఆలనా పాలనా చూసుకొనే ఆయాలుగా మాత్రమే చూడాలనిి వారన్నారు. హై స్కూలు లలో విద్యార్థులు ఎక్కువగా ఉండటం వల్ల మూడు వందల మంది విద్యార్థులకు ఒక ఆయా సరిపోవటం లేదు కావున 100కు పైబడిన ప్రతి హై స్కూలుకు ఒక ఆయాను అదనంగా నియమించాలనిి కోరారు. సుప్రీంకోర్టు నిబంధనలో మేరకు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారుు. సఫాయి కార్మికుల కర్మచారుల చట్టంలోని 108 జీవో ప్రకారం 11,500 జీతం ఇవ్వాలని కోరారు. లేదంటే పారిశుద్ధ్య కార్మికుల వలె 8 గంటల పని చేస్తున్నారు కాబట్టి వీరిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 21,000 కనీస వేతనంగాని పి.ఎఫ్ ,ఈ.ఎస్.ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి గ్రామాల్లో రాజకీయ వేదింపులు ఆపాలని అన్నారు.డిమాండ్ల సాధనకై ఈనెల 17 న తలపెట్టిన చలో విజయవాడ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశానికి స్కావెంజర్స్ యూనియన్ నాయకురాలు సుంకమ్మ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో స్కావెంజర్స్ సభ్యులు లక్ష్మీదేవమ్మ , ఉమా, వరలక్ష్మి,అమరావతి ప్రమీలమ్మ,లక్ష్మమ్మ ,శారదమ్మ అనిత, రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author