PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా డిజి ఆగ్రోస్ డీలర్ల 8 వ వార్షికోత్సవం

1 min read

– రైతులకు నాణ్యమైన ఉత్పత్తులను డీలర్లు అందించాలి
– ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : డిజి ఆగ్రోస్ డీలర్ల సమావేశం స్థానిక రామచంద్రరావు పేట హోటల్ అతిధి సమావేశ మందిరంలో కృష్ణా జిల్లా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా డీలర్లతో ఎనిమిదోవ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా ఏర్పాటు చేశారు. వార్షికోత్సవ సందర్భంగా సుమారు 100 మంది డీలర్లు హాజరయ్యారు, డిజి ఆగ్రోస్ మైక్రో న్యూట్రియెంట్ మరియు పురుగుమందుల డిస్ట్రిబ్యూటర్ మరియు డైరెక్టర్ పి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వార్షికోత్సవం ఏర్పాటు చేశారు. ఇ సందర్భంగా పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లా, తూర్పుగోదావరి జిల్లాల డీలర్లు సమావేశానికి అధిక సంఖ్యలో పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) ని డైరెక్టర్ పి కోటేశ్వరావు పూలమాల అందించి శాలువా కప్పి ప్రత్యేకంగా అభినందించి ఆహ్వానించారు. ఎంతో బిజీ కార్యక్రమాలు ఉన్న తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన నానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ మైక్రో న్యూట్రియన్స్, మరియు పురుగుల మందులు, నాణ్యమైన విత్తనాలు రైతుకు అందించాలని వారికి సాంకేతిక ఆధునిక ప్రయోజనాలకు ఎప్పటికప్పుడు తోడ్పడాలని సూచించారు. రాబోయే రోజుల్లో డీజీ ఆగ్రోస్ ఆగ్ర స్థానంలో నిలచి రైతులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. వారికి డీలర్లు సహాయకారులుగా నిలవాలని నాని కోరారు. గతంలో ఇదే తరహాలో వార్షికోత్సవ వేడుకలను తణుకు. తాడేపల్లిగూడెం. భీమవరం. ఏలూరు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి డీలర్ల కు (డీజీ) ఆగ్రోస్ ఉత్పత్తులను నాణ్యత విషయాలలో డీలర్లకు సూచనలు, సలహాలు అందించి వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవడం జరిగిందన్నారు. ఉత్తమ డీలర్లకు మెమొంటో అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్, వెస్ట్ జిల్లా ల ఇన్ చార్జ్ సిహెచ్ బాల మురళి కృష్ణ , మైలవరం ఎస్ ఓ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి మరియు ఏలూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్లు నూక పెయ్యి సుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాస్ , మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీవిలు , మాజీ చైర్మన్ మంచెo మైబాబు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యులు పెదబాబు, స్థానిక కార్పొరేటర్ తోట హేమ సుధీర్, కిలాడి దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.

About Author