ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం..
1 min read– నేడే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఆంధ్రప్రదేశ్ లో 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం జరగనున్న 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు పెద్ద సంఖ్యలో సిబ్బందిని నియమించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
నందికొట్కూరు నియోజకవర్గంలో….
సోమవారం జరిగే పట్టభధ్రులు, టీచర్స్ ఎమ్మేల్సీ ఎన్నికల కోసం నియోజకవర్గంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గంలో గ్రాడ్యూయేట్స్ 7723 మంది, టీచర్స్ 519 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో మహిళా గ్రాడ్యూయేట్స్ 2041, పురుషులు గ్రాడ్యూయేట్స్ 5681 మంది కాగా, మహిళా టీచర్స్ 162, పురుషులు 357 మంది ఓటర్లు ఉన్నారు. మండలాల వారిగా నందికొట్కూరు గ్రాడ్యూయేట్స్ 2789, టీచర్స్ 278, పగిడ్యాల మండలం గ్రాడ్యూయేట్స్ 1256, టీచర్స్ 77, జూపాడుబంగ్లా మండలం గ్రాడ్యూయేట్స్ 945, టీచర్స్ 48, కొత్తపల్లి మండలం గ్రాడ్యూయేట్స్ 830, టీచర్స్ 42, మిడుతూరు మండలం గ్రాడ్యూయేట్స్ 952, టీచర్స్ 38, పాములపాడు మండలం గ్రాడ్యూయేట్స్ 951, టీచర్స్ 36, ఎమ్మేల్సీ అభ్యర్థులకు ఆయా మండలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో ఓటు వేయనున్నారు.
ఏపీలో 5 ఎమ్మెల్సీ ల గెలుపే లక్ష్యంగా…
మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవాలని అధికారపార్టీ ఉవ్విలూరుతుండగా, అటు విపక్షాలు ఆ స్థానాలను దక్కించుకునేందుకు జోరుగా ప్రచారం చేశాయి. తూర్పు, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖలో గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు టీచర్స్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. అనంతరం ఫలితాలు ప్రకటిచంనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం షాపులను బంద్ చేయడంతోపాటు పోలీసు బందోబస్తు పెంచారు.