దివ్యాంగులకు ఆళ్ల నాని ట్రై సైకిల్ పంపిణీ
1 min read– నీతా విజయకుమార్ జైన్ దంపతులకు అభినందనలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక రామచంద్రరావు పేట జిల్లా పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా పార్టీ శ్రేణుల మధ్య వేడుకలు వేలాదిమంది అభిమానులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, సమక్షంలో ఘనంగా నిర్వహించారు, అనంతరం 50 కేజీల భారీ కేక్ కట్ చేసి అందరికీ అందజేశారు. వైయస్ ఆర్ జోహార్ అంటూ. జగన్మోహన్ రెడ్డి జిందాబాద్. జగనన్న కు శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద ఎత్తున నినాదాలతో ఆనందంతో కేరింతలు చేశారు, ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కో ఆప్షన్ సభ్యురాలు నీతా విజయకుమార్ జైన్ దంపతులు సుమారు 40,000 వ్యయంతో విభిన్న ప్రతిభావంతులైన వారికి రెండు (ట్రై సైకిళ్లు) మూడు చక్రాల వాహనాలు రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి , జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని సమక్షంలో కేక్ కట్ చేసి, పండ్లు అందజేసి ఏలూరు శనివారం పేట ప్రాంతానికి చెందిన గొల్ల వెంకటేశ్వరరావు, పోణింగి ప్రాంతానికి చెందిన ఉప్పు కొండ ఇరువురికి దివ్యాంగులకు (ట్రై సైకిల్) పంపిణీ చేశారు. వైయస్సార్ పార్టీ కుటుంబ సభ్యులు అండగా ఉంటారని నాని వారికి భరోసా ఇచ్చారు. దివ్యాంగులకు ఈ విధంగా అనేక సందర్భాలలో సహాయపడటం అభినందనీయమని నీతా విజయ్ కుమార్ జైన్ దంపతులను ఆళ్ల నాని అభినందించారు.