NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ పెద్దింటి అమ్మవారిని దర్శించుకున్న మాజీ టీటీడీ చైర్మన్

1 min read

– కనుమూరి బాపిరాజు, అన్నపూర్ణమ్మ దంపతులు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు: జిల్లా, కైకలూరు మండలం, కొల్లేటికోట గ్రామంలో వేంచేసియున్న శ్రీ పెద్దింటి అమ్మవారి దర్శనార్థమై తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ మరియు మాజీ మంత్రివర్యులు కనుమూరి భాపిరాజు, ధర్మపత్ని అన్నపూర్ణమ్మ విచ్చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు, ఆలయ కార్య నిర్వహణ అధికారి కె వి గోపాలరావు వారిని ఆలయ అతిధి మర్యాదలతో ఆహ్వానించి ఆలయ అర్చకులతో విశేష పూజలు జరిపించి శేష వస్త్రములతో పూలమాలలతో వారిని సత్కరించరు. అనంతరం తీర్థ ప్రసాదములు అందజేసినారు. అమ్మవారి జాతర ఉత్సవము ముగిసిన అనంతరం ఈరోజు ఆదివారం అగుటవలన శ్రీ అమ్మవార్లను దర్చించుటకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పాల పొంగళ్ళు నైవేద్యములు సమర్పించుకుని తమ తమ మ్రొక్కుబడులను చెల్లించుకున్నారని, ఈ కార్యక్రమంలో స్థానిక కైకలూరు నియుజకవర్గ శాసనసబ్యులు దూలం నాగేశ్వరరావు(DNR), కుమారులు దూలం అదివినయ్, దూలం శ్యామ్ పాల్గొని భక్తులకు ఏవిదమైన అసౌకర్యము కలగకుండా ఏర్పాట్లను పరిశీలించరని ఆలయ కార్యనిర్వహణాధికారి కె.వి. గోపాలరావు ఒక ప్రకటనలో తెలియచేసినారు.

About Author