ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిడుతూరులో భారీగా పోలింగ్
1 min read– పట్టభద్రులు 83 శాతం,ఉపాధ్యాయులు 92 శాతం
– ఎండను సైతం లెక్కచేయకుండా చంటి బిడ్డలతో కేంద్రాలకు
– ఎస్ఐ మారుతి శంకర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ జరగగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మిడుతూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన పట్టభద్రులు మరియు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు మొత్తం 952 ఓట్లకు గాను 793 ఓట్లు(83 శాతం)పోల్ అయ్యాయి.ఉపాధ్యాయుల ఎన్నికల్లో మొత్తం 38 ఓట్లకు గాను 35 ఓట్లు(92 శాతం)పోల్ అయ్యాయని ఎన్నికల అధికారి తహసిల్దార్ సిరాజుద్దీన్ అన్నారు.మహిళలు చంటి బిడ్డలను లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు యువతీ యువకులు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.సోమవారం ఉదయం 8 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా క్యూ లైన్లో బారులు చేరారు.పోలింగ్ కేంద్రం దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా ఎస్సై జి.మారుతి శంకర్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.