ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
1 min read– ఉదయం నుండే బారులు తీరిన ఓటర్లు
– ఎలాంటి సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల, అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగాయి, ఉదయం నుండి పట్టభద్రుల ఓటర్లు, అదేవిధంగా ఉపాధ్యాయులు ఓటింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఉదయం నుండి ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఈ ఎన్నికలను పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. – ఓటింగ్ సరళిని పరిశీలించిన కమలాపురం ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, కమలాపురం టిడిపి ఇంచార్జి పుత్తా నరసింహరెడ్డి, చింతకొమ్మదిన్నె జడ్పిటిసి నరేన్ రామాంజనేయులు రెడ్డి, కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆయన తనయులు నరేన్ రామాంజనేయులు రెడ్డి చెన్నూరు బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఓటింగ్ సరళిని పరిశీలించారు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలలో స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, కాగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది, ఈ భద్రత ఏర్పాట్లను ఫ్యాక్షన్ జోన్ డిఎస్పి చెంచు బాబు, సీఐ లు రామచంద్రయ్య, అశోక్ రెడ్డి పర్యవేక్షించారు, మండల వ్యాప్తంగా పట్టబద్రులు 1100 లు కాగా, 925 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, ఉపాధ్యాయ ఓటర్లు 67 మందికి కాను 66 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది.