ఓటు హక్కు వినియోగించుకున్న నాయకులు.. ఉపాధ్యాయులు
1 min read– ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు
– అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టంగా భద్రతలు
పల్లెవెలుగు వెబ్ కౌతాళం: మార్చి 13 పల్లెవెలుగు న్యూస్: ఎమ్మెల్సీ ఓటింగ్ సందర్భంగా డిగ్రీ సోదరులు నాయకులు ఉపాధ్యాయులు సోమవారం స్థానిక జిల్లా ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లలో వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌతాళం మండలంలో 788 ఓటర్లు ఉండగా అందులో 638 ఓటర్లు మాత్రమే వినియోగించుకున్నారు. 80శాతం పోలింగ్ జరిగింది. ఉపాధ్యాయులు తొమ్మిది మంది ఉండగా 9 మంది వినియోగించుకున్నారు ఎమ్మెల్సీ ఓటింగ్ సందర్భంగా, తాలూకా సిఐ మహేశ్వర్ రెడ్డి, ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది భారీగా బందోబస్తు నిర్వహించారు. ఎక్కడ అవాంఛన్య సంఘటన జరగకుండా భద్రతను పటిష్టంగా నిర్వహించారు. ఓటు హక్కు వినియోగించు వారు మాట్లాడుతూ ఓటు హక్కు స్వాతంత్రం హక్కు అని అర్హులైన వారు ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యం దోహదపడాలని కోరారు. ఈ పోలింగ్ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయం నుండి డిప్యూటీ తహసిల్దార్ రమేష్ రెడ్డి,విఆర్వోలు ఏ హెచ్ ఏ మరియు సిబ్బంది మరియు ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీడీవో జగన్ మోహన్ రెడ్డి మరియు సిబ్బంది పోలింగ్ బూత్ లలో పర్యవేక్షణలో పాల్గొన్నారు.