వెలుగోడు లో ఎన్నికలు ప్రశాంతం..78శాతం పోలింగ్
1 min read– ఓటు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే , కుటుంబ సభ్యులు
పల్లెవెలుగు వెబ్ వెలుగోడు : మండల కేంద్రమైన వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మండలంలో మొత్తం 1860 పట్టభద్రుల కు గాను 1462 పోలింగ్ జరిగి 78 శాతం నమోదైనట్లు ఎన్నికల పర్యవేక్షణ అధికారులు శ్రీనివాసులు , ఆంజనేయులు తెలిపారు. పట్టభద్రుల 312 పోలింగ్ బూత్ లో 763 ఓటర్లకు గాను 595 పోలింగ్ జరిగింది. అందులో పురుషులు 482 మంది , మహిళలు 113 మంది ఓటు చేశారు.313 పోలింగ్ బూత్ లో 1097 ఓటర్లకు గాను 867 మంది ఓటు వేశారు. పురుషులు 604 మంది కాగా , మహిళలు 263 మంది ఓటు చేశారు. టీచర్ల పోలింగ్ బూత్ 167 లో 103 ఓటర్లకు గాను 96 మంది ఓటు వేశారు. పురుషులు 65 మంది , 31 మంది మహిళలు ఓటు వేశారు. మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి , భార్య శైలజ , కూతురు మేఘన తో కలసి 312 పోలింగ్ బూతులో తమ ఓటు హక్కువినియోగించుకున్నారు. ఈ ఎన్నికల ను ఎలక్ట్రోల్ అధికారి రాజశేఖర్ పర్యవేక్షణ చేసారు. పోలింగ్ బందోబస్తు ఎస్.ఐ జగన్ మోహన్ నిర్వహించగా , అడిషనల్ ఎస్పీ రమణ , ఎస్సి,ఎస్టీ ,విభాగం డిఎస్పీ రామాంజి నాయక్ , ఆత్మకూరు డిఎస్పీ శృతి బందోబస్తు పర్యవేక్షణ చేశారు.