PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ ఉరుకుందు ఈరన్న దేవస్థానం లో జరిగిన దొంగతనము సొత్తు రికవరీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం: కర్నూల్ జిల్లా, కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎరిసా వలి ఆద్వర్యంలో టి. నరేంద్ర కుమార్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, కౌతాళం పి ఎస్ వారు ముద్దాయిలను అరెస్ట్ చేసి దొంగలించిన Rs. 1,47,835/- ల నగదు, 56 తులాలు వెండి మరియు సుమారు 0.480 మిల్లీ గ్రాముల బంగారు ను రికవరీ చేసినారు.ముద్దాయిల వివరాలు :
1). బావిగడ్డ గోపి S/o. B. శ్రీనివాసులు, వయస్సు 20 సం.లు 2). K. ఆనంద్ రాజు, S/o K. తిక్కయ్య, వయస్సు 20 సం.లు 3), రాజు S/o. అమ్రేష్, వయస్సు 19 సం.లు మరియు ముగ్గురు వ్యక్తులు.
అందరిదీ. SC కాలనీ, కౌతాళం గ్రామం మరియు కౌతాలం మండలం
ముద్దాయిలు జల్సాలకు అలువాటు పడి, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు సరిపోక అందరూ కలసి మాట్లాడుకొని ఆదివారం 12.03.2023 వ తేదీన తెల్లవారుజామున పై తెల్పిన ఆరు. మంది సదరు దేవస్థానం దగ్గరకు వెళ్ళి నలుగురు వ్యక్తులు బయట కాపలా ఉండగా, దేవస్థానం లోకి బావిగడ్డ గోపి మరియు ఒక వ్యక్తి గేటు దూకి ప్రవేశించి గర్భగుడి ముందు గల ఉచిత దర్శనం Q లైన్ లో పెట్టిన స్టీల్ హుండీ కి తాళంపై గల ఇనుప కొక్కీని ఇనుప రాడ్డుతో మెండగా, హుండీ తాళం దగ్గర వద్ద చేయి దూరేటంత గా రేకును ఓపెన్ చేసుకొని అందులో నుండి సుమారు ఒక లక్ష రూపాయలు నగదు మరియు కానుకలు దొంగలించి ఉండవచ్చునని ఇచ్చిన పిర్యాదుపై కేసు నమోదు చేసుకొని కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఆద్వర్యంలో కౌతాలం ఎస్ ఐ నరేంద్రకుమార్ రెడ్డి మరియు సిబ్బంది హుస్సేన్ బాష, నరేంద్ర, వీరభాస్కర్ మరియు వీరేషు లు బృందాలుగ ఏర్పాటు చేసి ఆలయంలోని మరియు కౌతాలం మండలం లోని సీసీ కెమెరాల ఆధారంగా ముద్దాయిల కొరకు వెతుకుతుండగా ఈ దినము ముద్దాయిల సమాచారం రాగా కేసును 24 గంటల లోపల చేధించి ముద్దాయిలను అరెస్టు చేసి దొంగతనం చేసిన Rs. 1,47,835/- ల నగదు, 56 తులాలు వెండి మరియు సుమారు 0.480 మిల్లీ గ్రాముల బంగారు చొప్పున మొత్తము 1,80,335/- సొమ్మును రికవరీ చేసినాము,ముద్దాయిలు ను అరెస్ట్ చేసిన ప్రదేశం – కర్నూల్ జిల్లా, కౌతాళం గ్రామం శివారున గల గాజుల చెరువు వద్ద అరెస్ట్ చేయడమైనది. కేసును త్వరితగతిన చేధించిన కోసిగి సిఐ ఎరిసా వలి కౌతాలం ఎస్ ఐ నరేంద్రకుమార్ రెడ్డి మరియు సిబ్బంది హుస్సేన్ బాష, నరేంద్ర, వీరభాస్కర్ మరియు వీరేషు లను ఆదోని ఎస్ డి పి ఓ వినోద్ కుమార్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

About Author